OTT Movie: నో యాక్షన్.. నో గ్లామర్ సాంగ్స్.. అయినా నెట్టింట రచ్చ చేస్తున్న సినిమా..
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అనేక చిత్రాలు విడుదలయ్యాయి. 'ఛావా', 'సైయారా' రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాయి. కానీ అలాంటి కొన్ని చిత్రాలు - 'సితారే జమీన్ పర్', క్రేజీక్స్, 'కేసరి చాప్టర్ 2' కూడా వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా గురించి మీకు తెలుసా.. ? గ్లామర్ సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లేకుండానే భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన తర్వాత ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. ఈ చిత్రం IMDB రేటింగ్ 7.4. ఇది ఫ్యామిలీ డ్రామా. క్లైమాక్స్ హృదయాలను బరువెక్కిస్తుంది. 2 గంటల 21 నిమిషాల నిడివి గల ఈ చిత్రం 21 సంవత్సరాల పాటు ఒక కుటుంబం చేసిన ప్రయాణాన్ని చూపిస్తుంది. ఈ కుటుంబం ఏకైక ఉద్దేశ్యం 3 BHK ఇల్లు కొనడమే. ఈ ఇల్లు కొనడానికి మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఇబ్బందులను ఇక్కడ చూపించారు. ఈ చిత్రం పేరు ‘3 BHK’.
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..
ఇందులో శరత్ కుమార్, సిద్ధార్థ్, దేవయాని, మీతా రఘునాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అరవింద్ సచ్చిదానందం రాసిన ‘3 BHK వీడు’ అనే చిన్న కథ ఆధారంగా రూపొందించారు.. ఈ సినిమా కథ 2006 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. ఒక కుటుంబం అద్దె ఇంటికి మారుతుంది. ఆ కుటుంబంలో వాసుదేవన్, అతని భార్య శాంతి, ఇద్దరు పిల్లలు ప్రభు, ఆర్తి ఉన్నారు. పెరుగుతున్న అద్దెలు, చిన్న ఇళ్ల సమస్యలతో సతమతమవుతున్న మధ్యతరగతి కుటుంబం ఇది. ఆ కుటుంబానికి ఒకే ఒక కల ఉంది – 3 BHK ఇల్లు కొనడం. వారు దాని కోసం కూడా ఎన్నో ప్లాన్స్ చేస్తుంటారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, గ్లామర్ సాంగ్స్ లేకుండానే భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఈ ఫ్యామిలీ డ్రామాను చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?




