Siren 108 OTT: నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ – జయం రవి థ్రిల్లర్ మూవీ.. ‘సైరన్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

షూటింగ్ పూర్తి చేసుకున్నసైరన్‌ మూవీ డిసెంబర్‌లోనే థియేటర్లలో రిలీజ్‌ కావాల్సింది. అయితే అదేమీ జరగలేదు. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్‌ కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ మీడియా కథనాల ప్రకారం 'సైరన్ 108' సినిమాను థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట.

Siren 108 OTT: నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ - జయం రవి థ్రిల్లర్ మూవీ.. 'సైరన్‌' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Siren Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 15, 2024 | 9:00 AM

‘పొన్నియన్ సెల్వన్’ తర్వాత కోలీవుడ్ స్టార్‌ హీరో జయం రవి నటించిన తాజా చిత్రం సైరన్ 108. మహానటి కీర్తి సురేశ్ మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌ రోల్ పోషిస్తోంది. అలాగే మరో మలయాళం బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ మరో కీలక పాత్రలో మెరవనుంది. గతంలో అభిమన్యుడు, విశ్వాసం వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోని భాగ్యరాజ్‌ తొలిసారి మెగా ఫోన్ పట్టి సైరన్‌ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంరి రిలీజైన పోస్టర్స్‌, టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్నసైరన్‌ మూవీ డిసెంబర్‌లోనే థియేటర్లలో రిలీజ్‌ కావాల్సింది. అయితే అదేమీ జరగలేదు. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్‌ కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ మీడియా కథనాల ప్రకారం ‘సైరన్ 108’ సినిమాను థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26న సైరన్‌ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌ కు తీసుకొచ్చే ఆలోచనలో ఉందట చిత్ర బృందం. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి సైరన్‌ స్ట్రీమింగ్‌ అవ్వనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని కోలీవుడ్ సర్కిళ్లలో టాక్‌ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

సైరన్‌ సినిమాలో కీర్తి సురేశ్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనుంది. అనుపమా పరమేశ్వరన్‌ సముద్రఖని, యోగి బాబు, తులసి, కౌశిక్ మెహతా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోమ్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుజాత విజ‌య్ కుమార్ – అనూష విజయ్ కుమార్ భారీ బ‌డ్జెట్‌తో ‘సైరన్’ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందించారు. సెల్వ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా, రూబెన్ ఎడిటర్ గా వర్క్ చేసారు. త్వరలోనే నిర్మాతలు సైరన్‌ సినిమా విడుదలపై మేకర్స్‌ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. లెట్స్‌ వెయిట్ అండ్‌ సీ.

సైరన్ సినిమాలో జయం రవి

సైరన్ సినిమాలో కీర్తి సురేశ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.