OTT: ఓటీటీలోకి మరో మలయాళ సూపర్ హిట్ సినిమా.. ఊహించని ట్విస్టులు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
మలయాళంలో దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అలాగే ఇటీవల నటుడు బసిల్ జోసెఫ్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలా జీతూ జోసెఫ్ దర్శకుడిగా, బసిల్ జోసెఫ్ హీరోగా వచ్చిన ‘నూనక్కళి’ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది
మలయాళంలో దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అలాగే ఇటీవల నటుడు బసిల్ జోసెఫ్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలా జీతూ జోసెఫ్ దర్శకుడిగా, బసిల్ జోసెఫ్ హీరోగా వచ్చిన ‘నూనక్కళి’ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాలో బైజూ సంతోష్, నిఖిల విమల్, మనోజ్ కే జయన్, అల్తాఫ్ సలీం, బినూ పప్పు, అజీబ్ నడుమగ్డన్, అజు వర్గీస్ కీలకపాత్రలు పోషించారు. నూనక్కళి’ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన ఈ క్రమంలో దర్శకుడు జీతూ జోసేఫ్ మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎదురయ్యే అనూహ్య మలుపులను, నవ్వులతో అందంగా మల్చిన చిత్రం నూనక్కళి. ‘ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అతి తక్కువ దూరం నవ్వు’ అని, ఈ సినిమాతో కుటుంబ సభ్యులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. బసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఓనమ్ పండుగ సమయంలో విడుదలవుతుండటంతో వీక్షకులు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆస్వాదించగలరని ఆశిస్తున్నాము. థియేటర్‌లలో పొందిన ప్రేమ మా అంచనాలకు మించినది. ఇక ఇప్పుడు ZEE5 ద్వారా మన అందరి వద్దకు రాబోతోంది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, మన దైనందిన జీవితంలో అంతర్లీనంగా ఉన్న హాస్యాన్ని కూడా గుర్తు చేసేలా ఉంటుంది’ అని అన్నారు.
ఇక నటుడు బసిల్ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘రోజువారీ మలయాళీ యువతను ప్రతిధ్వనించే పాత్రలను పోషించేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాను – నూనక్కళితో మరోసారి అలాంటి ఓ పాత్రను పోషించాను. ఇందులో నేను ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ, ఏదో ఒక చిక్కుముడి సమస్యతో ఉంటాను. థియేటర్లలో మాకు ఆడియెన్స్ మంచి విజయాన్ని అందించారు. ఇక ఇప్పుడు మా చిత్రం ZEE5లో ప్రీమియర్ అవుతున్నందుకు సంతోషిస్తున్నాను’ అని అన్నారు.
ఓనం పండగ స్పెషల్.. సెప్టెంబర్ 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్..
This Onam, where comedy meets chaos and laughter never ends! Get ready to laugh out loud with #NunakkuzhiOnZee5 , premiering on #ZEE5 this September 13th.
Premiering in Malayalam | Telugu | Kannada@AjuVarghesee @basiljoseph25 @jeethu4ever @zee5india @zee5global #Zee5Telugu pic.twitter.com/tmVCx1PckG
— ZEE5 Telugu (@ZEE5Telugu) September 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.