
ఇతర జానర్లతో పోల్చితే హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. అందుకోసమే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం ఈ జానర్ మూవీస్ నే ఎక్కువగా స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ఆయా భాషల ఆడియెన్స్ కు తగ్గట్టుగానే డబ్ చేసి ఓటీటీలోకి రిలీజ్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక సీరియల్ కిల్లర్ జానర్ కు సంబంధించిన మూవీనే. ఇందులో ఒక సైకో కిల్లర్ కేవలం అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసి చంపుతాడు. పోలీసులు సైతం అతన్ని పట్టుకోలేకపోతారు. చెప్పుకోవడానికి కథ సాధారణంగానే ఉన్నా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేస్తుంది. ఈ మూవీ మొత్తం భువనేష్ చుట్టూ తిరుగుతుంది. అతని తల్లి శివగామి క్యాన్సర్‌తో బాధపడుతుంది. ట్రీట్ మెంట్ లో నొప్పిని భరించలేక మెర్సీ కిల్లింగ్ (కారుణ్య మరణం) కోసం వేడుకుంటుంది. దీంతో భువనేష్ తన తల్లి బాధను చూడలేకపోతాడు. ఆమె కోరికను నెరవేర్చడానికి ఒక బాధాకరమైన నిర్ణయం తీసుకుంటాడు. అప్పటి నుంచి హీరో వరుసగా అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ దారుణంగా చంపుతాడు. ముఖ్యంగా రోగంతో బాధపడే అమ్మాయిలనే ఎంపిక చేసుకుని మరీ హతమారుస్తాడు
ఈ మర్డర్ కేసును ఛేదించేందుకు ఇన్‌స్పెక్టర్ రఘురామ్ రంగంలోకి దిగుతాడు. అతని విచారణ లో భువనేష్ గతం, అతని ఉద్దేశ్యాలు, ఈ హత్యల మధ్య ఉన్న లింకుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరీ ఇంతకీ భువనేష్ ప్రత్యేకించి అమ్మాయిలనే చంపడానికి గల కారణాలేంటి? అతని చేతిలో చనిపోయిన అమ్మాయిలు ఎవరు? అసలు ఈ సైకో గతం ఏంటి? అతను ఎందుకిలా మారిపోయాడు ? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు సైలెంట్. సుమారు 1 గంట 36 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ… అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. సైకో కిల్లర్ సినిమాలంటే బాగా ఇష్టపడేవారికి ఈ ‘సైలెంట్’ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి