AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ మూవీ

దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తద్వారా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఐఎమ్ డీబీలోనూ ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు 8.3/10 రేటింగ్ దక్కడం విశేషం.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 17, 2025 | 6:38 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అందులో ఒక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉంది. దీపావళి కానుకగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్‌ మూమెంట్స్.. ఇలా ఓ కమర్షియల్ సినిమాకు కావల్సిన హంగులన్నీ ఇందులో ఉన్నాయి. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడనుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది.

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బైసన్. మారి సెల్వరాజ్ తెరకెక్కంచిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. రజిషా విజయన్‌, పశుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో విక్రమ్ కుమారుడి బైసన్..

బైసన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 21 నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.   ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్.

బైసన్ సినిమాలో ధ్రువ్ విక్రమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్