AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలోహాలీవుడ్ యాక్షన్‌ చిత్రం.. తెలుగులో మాత్రం ఉచితంగా స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే

ఇప్పటికే మరెవెల్ నుంచి వచ్చిన సినిమాలన్నీ మనదగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అంతే కాదు కలెక్షన్స్ కూడా మనదగ్గర భారీగా వసూల్ చేశాయి ఈ సినిమాలు. ఒక ఓటీటీల్లోనూ హాలీవుడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది.

ఓటీటీలోహాలీవుడ్ యాక్షన్‌ చిత్రం.. తెలుగులో మాత్రం ఉచితంగా స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే
Deadpool And Wolverine
Rajeev Rayala
|

Updated on: Nov 01, 2024 | 8:42 AM

Share

హాలీవుడ్ సినిమాలకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు ఇప్పటికే చాలా తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక సూపర్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇప్పటికే మరెవెల్ నుంచి వచ్చిన సినిమాలన్నీ మనదగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అంతే కాదు కలెక్షన్స్ కూడా మనదగ్గర భారీగా వసూల్ చేశాయి ఈ సినిమాలు. ఒక ఓటీటీల్లోనూ హాలీవుడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఓ భారీ యాక్షన్ మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. అది మాములు సినిమా కాదు. కలెక్షన్స్ పరంగా నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఆ సినిమా.. జూలై 26న బాక్సాఫీస్ వద్ద రిలీజైన డెడ్‌పూల్ అండ్ వాల్వరైన్ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే..

ఆ సినిమానే గత డెడ్‌పూల్ అండ్ వాల్వరైన్ ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే భారీగా వసూళ్లు రాబట్టింది. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కించిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది డెడ్‌పూల్ అండ్ వాల్వరైన్. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ అంచనాలను క్రియాట్ చేసుకుంది. రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది ఈ సినిమా..

ఇక ఇప్పుడు డెడ్‌పూల్ అండ్ వాల్వరైన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. కానీ ఇండియాలో ఈ సినిమా ఇంకా అందుబాటులోకి రాలేదు. కాగా ఇప్పుడు ఈ సినిమా ఇండియాలో ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. నవంబర్ 12 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా. ఇద్యలో ఈ సినిమాను తెలుగు, ఇంగ్లిష్, తమిళ్ తో పాటు హిందీలోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కాగా  డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఈ సినిమాను ఉచితంగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.. ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us