Janaki V v/s State of Kerala : విడుదలకు ముందే వివాదాలు.. ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న అనుపమ సినిమా..

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, కేంద్ర మంత్రి, నటుడు సురేష్ గోపి ప్రధాన పాత్రలలో నటించిన మలయాళం లీగల్ డ్రామా జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తో సుదీర్ఘ వివాదం జరిగిన సంగతి తెలిసిందే.

Janaki V v/s State of Kerala : విడుదలకు ముందే వివాదాలు.. ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న అనుపమ సినిమా..
Janaki Vs State Of Kerala

Edited By: TV9 Telugu

Updated on: Aug 08, 2025 | 12:54 PM

భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం వంటి వరుస తెలుగు సూపర్‌హిట్‌లను అందించిన తర్వాత ZEE5 తెలుగు ఇప్పుడు మరో అద్భుతమైన సినిమాను అందించబోతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనే ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు.

ఇవి కూడా చదవండి

Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..

ఈ చిత్రంలో గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఈ చిత్రానికి రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ఆగస్టు 15న ‘J.S.K – జానకి V vs. స్టేట్ ఆఫ్ కేరళ’ ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌ను జీ5లో మాత్రమే చూడండి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం, ఈ వీకెండ్‌ను ఉత్కంఠభరితమైన కోర్టు డ్రామాతో ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..

Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..