AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: పునీత్​కు అమెజాన్ ప్రైమ్ ట్రిబ్యూట్.. ఫ్రీగా 5 సినిమాలు చూసే ఛాన్స్

 కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్​కుమార్​.. గతేడాది అక్టోబరు 19న గుండెపోటుతో అకస్మికంగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా పునీత్​కు.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్​ కూడా తనదైన రీతిలో నివాళి ఇచ్చేందుకు సిద్ధమైంది.

Puneeth Rajkumar: పునీత్​కు అమెజాన్ ప్రైమ్ ట్రిబ్యూట్.. ఫ్రీగా 5 సినిమాలు చూసే ఛాన్స్
Puneeth Rajkumar
Ram Naramaneni
|

Updated on: Jan 22, 2022 | 11:26 AM

Share

Amazon Prime Video:  కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్​కుమార్ (Puneeth Rajkumar)​.. గతేడాది అక్టోబరు 19న గుండెపోటుతో అకస్మికంగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికంగా లేరని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం నటుడిగానే కాక ఎన్నో సహాయ కార్యక్రమాలు  చేసి ప్రజల్లో గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు పునీత్. కాగా పునీత్​కు.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్​ కూడా తనదైన రీతిలో నివాళి ఇచ్చేందుకు సిద్ధమైంది. పునీత్ నటించిన​ 5 చిత్రాలను( లా, ఫ్రెంచ్ బిర్యానీ, కావలుదారి, మాయాబజార్ & యువరత్న) ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఫ్యాన్స్, యాప్​లో ఫ్రీగా చూసే ఛాన్స్ కల్పించింది. ప్రైమ్ సభ్యులు కాని వారు కూడా ఉచితంగా ఈ సినిమాలు చూడవచ్చు. అలానే పునీత్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోన్న మూడు కొత్త సినిమాలు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘వన్ కట్ టూ కట్’, ‘ఫ్యామిలీ ప్యాక్​’ కూడా తమ ఓటీటీలోనే విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రకటన చేసింది.

 బాలనటుడిగానే సినిమాల్లో నటించడం ప్రారంభించిన పునీత్.. 2002లో ‘అప్పు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి అతడని ఫ్యాన్స్ ‘అప్పు’ అని పిలవడం ప్రారంభించారు. అభి, వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, హుదుగురు, అంజనీపుత్ర తదితర సినిమాలతో హిట్లు కొట్టి  స్టార్ హీరోగా రాణించారు పునీత్. మొత్తం 32 సినిమాల్లో నటించారు. గతేడాది ఏప్రిల్​లో విడుదలైన ‘యువరత్న’ మూవీలో చివరగా కనిపించారు. ఈ మూవీ తెలుగులోనూ విడుదలై మంచి విజయం సాధించింది. నటుడిగానే కాకుండా సింగర్​గాను అభిమానుల్ని అలరించారు పునీత్. గాయకుడిగా పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.

Also Read: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తోన్న వధువును చెంపపై కొట్టిన వరుడు.. ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది