AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sathi Gani Rendu Ekaralu: ఆహాలో సత్తిగాని రెండెకరాలు సినిమా.. కొత్త స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదే

పుష్ప సినిమాలో కేశవ్‌ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీష్‌ ప్రతాప్‌ బండారి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సత్తిగాని రెండెకరాలు. వెన్నెల కిశోర్‌, అనీషా, మోహన శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభినవ్‌ దండ దర్శకత్వం వహించారు.

Sathi Gani Rendu Ekaralu: ఆహాలో సత్తిగాని రెండెకరాలు సినిమా.. కొత్త స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదే
Sattigani Rendekaralu
Basha Shek
|

Updated on: May 03, 2023 | 9:33 PM

Share

పుష్ప సినిమాలో కేశవ్‌ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీష్‌ ప్రతాప్‌ బండారి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సత్తిగాని రెండెకరాలు. వెన్నెల కిశోర్‌, అనీషా, మోహన శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభినవ్‌ దండ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ భారీ సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని రూపొందించారు. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే కొన్ని కారణాలతో ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. అయతే ఎట్టకేలకు రిలీజ్‌ ముహూర్తాన్ని ఖరారు చేసుకుంది. తాజాగా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మే 26 నుంచి సత్తిగాని రెండెకరాలు సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతుందని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ఈమేరకు కొత్త పోస్టర్‌ కూడా విడుదల చేసింది. దీనికి ‘‘సత్తి ముందు జెప్పిన రోజు రాలే.. వాని రెండెకరాల భూమి చిక్కుల్లో పడిండే.. ఇగ అన్నీ సెటిల్‌ అయినయ్‌. మే 26న ముహూర్తం పెట్టినం. అస్తుండు, ఆగమాగం జేయనీకి’ అంటూ ఇంట్రెస్టింగ్‌ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.

కాగా భూ సమస్యల నేపథ్యంలో సత్తిగాని రెండెకరాలు సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. టీజర్‌లో చెప్పిన ప్రకారం.. హీరో జగదీష్ ప్రతాప్ బండారి ఓ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసం ఆయనకు రూ. 25 లక్షలు అవసరమవుతాయి. అందుకోసం తనకున్న రెండెకరాల భూమిని అమ్మేయాలని అనుకుంటాడు. ఆ విషయంలో హీరోకి ఎదురయ్యే పరిస్థితులు, అవాంతరాలు ఏంటీ? వాటిని ఎలా అధిగమిస్తాడు అన్నదే ఈ సినిమా కథ. మరి పుష్పతో బన్నీ స్నేహితుడి పాత్రలో ప్రశంసలు అందుకున్న జగదీష్‌ ఈ మూవీతో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..