
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్… ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీప్రియులు, సంగీత ప్రియులు మెచ్చిన సింగింగ్ రియాల్టీ షో. ఇప్పటివరకు మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ రియాల్టీ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే అద్భుతమైన గాత్రం.. ఎంతో టాలెంట్ ఉండి.. తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న యంగ్ సింగర్స్ కోసం ఈషోను తీసుకురాబోతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంది యంగ్ సింగర్స్ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడుతూ గాయనీగాయకులుగా దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు సీజన్ 4 రాబోతుంది.
సీజన్ 4 ఎలా ఉండబోతుంది..? సెలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి.. ? హోస్ట్ ఎవరు ? జడ్జెస్ ఎవరు? అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ షో కోసం ఆన్ లైన్ ద్వారా ఆడిషన్స్ నిర్వహిస్తుంది ఆహా. ఆన్ లైన్ ఆడిషన్స్ ఓపెన్ అయ్యాయంటూ ఓ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ కోసం హైదారాబాద్ లో నిర్వహించే గ్రౌండ్ ఆడిషన్స్ తేదీని వెల్లడిస్తూ మరో పోస్టర్ రిలీజ్ చేసింది.
ఈసారి నాలుగో సీజన్ కు తమన్, సింగర్ కార్తీక్, గీతా మాధురి జడ్జ్ లుగా ఉండనున్నారు. ఇక హైదరాబాద్ లో ఆగస్ట్ 3న గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించనున్నారని నిర్వాహాకులు వెల్లడించారు. ” రిషి ఎమ్.ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. జేఎన్టీయూహెచ్ మెట్రో స్టేషన్ పక్కన.. కూకట్ పల్లి. హైదాబారాబాద్ (Rishi MS Institute of Engineering and Technology for Women)”లో ఆగస్ట్ 3న సీజన్ 4 గ్రౌండ్ ఆడిషన్స్ జరగనున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీలో దాగున్న మంచి సింగర్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటే ఈ ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ లో పాల్గొని వేదికపై మీ టాలెంట్ నిరూపించుకోండి.
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..