నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో విజయవంతమైన సంగతి తెలిసిందే. ఎప్పుడూ యాక్షన్ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించే బాలయ్య.. సరికొత్తగా హోస్ట్‌గానూ మెప్పించారు. ఈ షో ద్వారా ఓటీటీ అరంగేట్రం చేసిన బాలయ్య.. తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ కావడంతో.. ఇక ఇప్పుడు సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. అలాగే ఈసారి కూడా ఎవరూ చూడని విధంగా బాలయ్య బాబు ని అభిమానులకి చూపించబోతున్నట్లుగా ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పేశారు. ఐఏండిబి లో టాక్ షో అన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ షో టీజర్‌ను రేపు (అక్టోబర్ 4న) విజయవాడలో సాయంత్రం 6 గంటలకు అభిమానుల ముందు ప్రదర్శించబోతున్నారు. విజయవాడ వేదికగా టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈసారి షోను మరింత కొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మొదటి సీజన్ మాదిరిగానే ఈ 2కు కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్నారు. అంతేకాకుండా.. అభిమానులు ఎప్పుడూ చూడని విధంగా చూపించబోతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఈ మూవీ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు.
ట్వీట్..
Dream come true for me! ?
Super excited for this project with none other than Man of Masses #NandamuriBalakrishna garu. Teaser launch of this @ahavideoin original from 6pm onwards @ Vijayawada.??️?☠️ pic.twitter.com/dCLJWMnQtA— Prasanth Varma (@PrasanthVarma) October 3, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.