AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyanam Kamaneeyam: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మరో సూపర్ హిట్.. ‘కళ్యాణం కమనీయం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కమర్షియల్ గా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ కాన్సెప్ట్ పరంగా మాత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో వెండితెరపై సందడి చేసింది ప్రియా భవానీ శంకర్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Kalyanam Kamaneeyam: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మరో సూపర్ హిట్.. 'కళ్యాణం కమనీయం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Kalyanam Kamaneeyam
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2023 | 9:08 AM

Share

ఇటీవల సంక్రాంతి బరిలో మెగా ప్రాజెక్టులతో పోటీ పడి సూపర్ హిట్‏గా నిలిచిన చిత్రం కళ్యాణం కమనీయం. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో యంగ్ హీరో సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ హీరోహీరోయిన్లుగా నటించారు. యువి కాన్సెప్ట్ నిర్మించిన ఈ చిత్రంతో అనిల్ కుమార్ ఆళ్ళ ని దర్శకుడిగా పరిచయం చేశారు. అయితే కమర్షియల్ గా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ కాన్సెప్ట్ పరంగా మాత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో వెండితెరపై సందడి చేసింది ప్రియా భవానీ శంకర్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

డైరెక్టర్ అనిల్ కుమార్ అల్ల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా పాటలు అందమైన సంగీత సాహిత్యాలతో ఆకట్టున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.