Bapu OTT: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ.. బాపు స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

థియేటర్లలో విడుదలైన సినిమాలు దాదాపు 45 రోజులకు ఓటీటీలోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. మరికొన్ని చిత్రాలు మాత్రం రెండు, మూడు నెలల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఓ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సిద్ధమైంది.

Bapu OTT: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ.. బాపు స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bapu Movie

Updated on: Mar 01, 2025 | 3:38 PM

టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ బాపు. ఇందులో సీనియర్ హీరోయిన్ ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, హీరోయిన్ ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, మణి ఏగుర్ల ప్రధాన పాత్రలలో నటించారు. ఫ్యామిలీ ఎమోషనల్ డార్క్ కామెడీగా వచ్చిన ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందే క్యూరియాసిటీ కలిగించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ సంపాదించుకుంది. మొదటి వారం రోజులు ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ అంతగా వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఈ సినిమా స్టోరీ లైన్ బాగున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలం అయ్యిందని టాక్ నడిచింది. ఇక థియేటర్లలో విడుదలైన 16 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యింది.

తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు మార్చి 7 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది హాట్ స్టార్. ఈ సినిమాలో గ్రామీణ ప్రజల జీవితాలను కళ్లకు కట్టినట్లుగా రియాలిస్టిక్ గా చూపించినట్లుగా రివ్యూస్ వచ్చాయి.

కథ విషయానికి వస్తే.. ఈ సినిమాను దాదాపు బలగం మూవీ తరహాలోనే రూపొందించారు. ఏ ఫాదర్ స్టోరీ అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్. తెలుగు సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ. ఇప్పుడు బాపు సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..