777 charlie: ఓటీటీలోకి వచ్చేస్తున్న 777 ఛార్లి మూవీ.. కానీ షరతులు వర్తిస్తాయి.. ఏంటంటే..
777 charlie: భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని దక్కించుకుంది. 777 ఛార్లి చిత్రం. కిరణ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఓ యువకుడికి, శునకానికి మధ్య...
777 charlie: భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని దక్కించుకుంది. 777 ఛార్లి చిత్రం. కిరణ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఓ యువకుడికి, శునకానికి మధ్య ఏర్పడిన అనుబంధాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు. కామేడీ, ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జూన్ 10వ తేదీన కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన మంచి కలెక్షన్లను రాబట్టింది. కేజీఎఫ్ తర్వాత మరోసారి కన్నడ సినిమా స్టామినాను ఈ చిత్రం చాటిచెప్పింది.
ఇదిలా ఉంటే 777 ఛార్లి కన్నడ ఓటీటీ వెర్షన్ జూలైలోనే అందుబాటులోకి వచ్చింది. అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా ఓటీటీ వెర్షన్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు. దీంతో ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 30 తేదీన విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం,మలయాళం,హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
a teary tale of the most precious bond to ever exist ??
777 Charlie available for rent from Sept 30 on the #PrimeVideoStore@rakshitshetty @Kiranraj61 @RajbShettyOMK @sangeethaSring @DanishSait @actorsimha @nobinpaul #PratheekShetty #ArvindKashyap #UllasHydur #PramodBc pic.twitter.com/eNcek5eSpn
— prime video IN (@PrimeVideoIN) September 24, 2022
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ అంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్కైబర్లు అందరూ ఈసినిమా చూడలేరు. రెంటల్ విధానంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా మూవీ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ట్రిపులార్, కేజీఎఫ్‌లాంటి చిత్రాలు ఇలాంటి విధానంలో వచ్చిన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..