AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెలవెలబోతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ..!

టాలీవుడ్ లో గడిచిన మూడు నెలలు ఒకసారి చూసుకుంటే హిట్స్ శాతం మరీ బలహీనంగా ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్ ని పరిశీలిస్తే హిట్ ఫిల్మ్స్ ని వేళ్ళల్లో లెక్కపెట్టవచ్చు. రీసెంట్ గా జనవరిలో ‘ఎఫ్2- ఫన్ & ఫ్రస్టేషన్’ మాత్రమే బాగా ఆడింది. ఇక తెలుగులో రిలీజ్ అయిన కన్నడ మూవీ ‘కె.జి.ఎఫ్’ అయితే అఖండ విజయం సాధించింది. మిస్టర్ మజ్ను, వినయ విధేయ రామ, పేట, కథానాయకుడు.. ఇలా ఈ మూడు నెలలో దాదాపు […]

వెలవెలబోతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 7:22 PM

Share

టాలీవుడ్ లో గడిచిన మూడు నెలలు ఒకసారి చూసుకుంటే హిట్స్ శాతం మరీ బలహీనంగా ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్ ని పరిశీలిస్తే హిట్ ఫిల్మ్స్ ని వేళ్ళల్లో లెక్కపెట్టవచ్చు. రీసెంట్ గా జనవరిలో ‘ఎఫ్2- ఫన్ & ఫ్రస్టేషన్’ మాత్రమే బాగా ఆడింది. ఇక తెలుగులో రిలీజ్ అయిన కన్నడ మూవీ ‘కె.జి.ఎఫ్’ అయితే అఖండ విజయం సాధించింది. మిస్టర్ మజ్ను, వినయ విధేయ రామ, పేట, కథానాయకుడు.. ఇలా ఈ మూడు నెలలో దాదాపు 20కి పైగా సినిమాలు ప్లాప్స్ చవి చూశాయి.   

డిసెంబర్ నెల చూసుకుంటే పడి పడి లేచే మనసు, అంతరిక్షం, కవచం, ఇదం జగత్, భైరవ గీత, ఓడియన్, మారి 2, సుబ్రహ్మణ్యపురం ఇలా రిలీజ్ అయిన అన్ని సినిమాలు ప్లాప్స్ చవి చూశాయి. చిన్న సినిమా ‘హుషారు’ మాత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. శర్వానంద్, వరుణ్ తేజ్ సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్నా అవి నిరాశ పరిచాయి. మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం ఓడియన్ కు కూడా ప్లాప్ టాక్ వచ్చింది. ఈ నెలలో డబ్ అయి రిలీజ్ అయిన కన్నడ మూవీ ‘కె.జి.ఎఫ్’ మాత్రం మంచి వసూళ్లు కలెక్ట్ చేసింది.

ఇక నవంబర్ విషయానికి వస్తే ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన అక్కినేని నాగచైతన్య ‘సవ్యసాచి’ డిజాస్టర్ కాగా విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ మంచి విజయాన్ని అందుకుంది. ఇక మిగిలిన సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి. జనవరి, ఫిబ్రవరి విషయం అందరికి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ ఎఫ్ 2 మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు మిగిలిన సినిమాలు అన్ని ప్లాప్ టాక్స్ తెచ్చుకున్నాయి.

మహర్షి, మజిలీ, వాల్మీకి, డిస్కో రాజా, నాని-విక్రమ్ కె కుమార్ చిత్రం ఇలా పలు సినిమాలు సమ్మర్ సీజన్ లో విడుదల కాబోతున్నాయి. ఈసారైనా టాలీవుడ్ కి మంచి హిట్స్ దక్కుతాయో లేదో వేచి చూడాలి.

Follow Us