AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంతవరకు చేయని పాత్రలో నాని..?

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని 24వ చిత్రంలో నటిస్తున్నాడు. సోమవారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తి అవ్వగా.. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ముగ్గురు కథానాయికలు నటిస్తోన్న ఈ చిత్రంలో నాని పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఈ చిత్రంలో నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడట. అదేంటంటే క్రైమ్ కథలను రాసే ఓ రచయిత పాత్రలో నాని కనిపించబోతున్నట్లు టాక్. మొదట ప్లే బాయ్ […]

ఇంతవరకు చేయని పాత్రలో నాని..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2019 | 1:57 PM

Share

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని 24వ చిత్రంలో నటిస్తున్నాడు. సోమవారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తి అవ్వగా.. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ముగ్గురు కథానాయికలు నటిస్తోన్న ఈ చిత్రంలో నాని పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఈ చిత్రంలో నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడట. అదేంటంటే క్రైమ్ కథలను రాసే ఓ రచయిత పాత్రలో నాని కనిపించబోతున్నట్లు టాక్.

మొదట ప్లే బాయ్ పాత్రలో నాని నటించబోతున్నట్లు వార్తలు రాగా.. తాజాగా రైటర్ కారెక్టర్ అని తెలుస్తోంది. కథ రొటీన్‌దే అయినప్పటికీ.. స్క్రీన్‌ ప్లేను విక్రమ్ డిఫరెంట్‌గా రాసినట్లు సమాచారం. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటిస్తోన్న ‘జెర్సీ’ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Follow Us