Official: బిగ్గెస్ట్‌ సర్‌ప్రైజ్‌ రివీల్‌.. ప్రభాస్ మూవీలో బిగ్‌బీ

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చేసింది

  • Tv9 Telugu
  • Publish Date - 10:26 am, Fri, 9 October 20
Official: బిగ్గెస్ట్‌ సర్‌ప్రైజ్‌ రివీల్‌.. ప్రభాస్ మూవీలో బిగ్‌బీ

Amitabh in Prabhas 21: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చేసింది. ఇందులో బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన టీమ్‌.. అందులో లెజండ్‌ లేకుండా మేము ఒక లెజండరీ చిత్రాన్ని ఎలా తీయగలం..? అమితాబ్‌ ఇందులో భాగం అయ్యారు. భారత్‌లో ఉన్న సూపర్‌స్టార్‌లను మీ ముందుకు తీసుకురాబోతున్నాము అని వెల్లడించింది.

కాగా సైన్స్‌ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా నటించనుంది. అలాగే లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు మెంటార్‌గా వ్యవహరించబోతున్నారు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ మూవీని దేశంలోని పలు భాషల్లో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుండగా.. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా సైరా నరసింహారెడ్డి మూవీ ద్వారా బిగ్‌బీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read More:

దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 70,496 కేసులు

జగపతిబాబు సోదరుడికి బెదిరింపు కాల్స్‌.. పోలీసులకు ఫిర్యాదు