AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khushbu Sundar: ఆ విషయం చెప్పినందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు..

కన్నతండే తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ షాకింగ్ ఆరోపణలు చేసిన సినీనటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ మరోసారి ఈ అంశంపై స్పందించారు. సొంత తండ్రే తనను లైంగికంగా వేధించారని

Khushbu Sundar: ఆ విషయం చెప్పినందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు..
Kushbu
Shiva Prajapati
|

Updated on: Mar 08, 2023 | 12:36 PM

Share

కన్నతండే తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ షాకింగ్ ఆరోపణలు చేసిన సినీనటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ మరోసారి ఈ అంశంపై స్పందించారు. సొంత తండ్రే తనను లైంగికంగా వేధించారని బయటి ప్రపంచానికి చెప్పినందుకు తానేమీ సిగ్గు పడటం లేదన్నారు. తాను ఎదుర్కొన్న పరిస్థితులను, తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రపంచానికి చెప్పానన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇదే అంశంపై మాట్లాడారు. ‘నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా అందరికి తెలియజేశాను. అందులో సిగ్గుపడే అంశం ఏమీ లేదు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు జరిగిన దారుణాన్ని చెప్పడానికి ఇంత సమయం పట్టింది. ప్రతి మహిళ తాము ఎదుర్కొన్న వేధింపులను వెల్లడించి, ధైర్యంగా ముందుకు సాగాలి. మిమ్మల్ని కించపరిచే వాటిని ప్రోత్సహించకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి’ అని ఖుష్బూ అన్నారు.

కాగా, ఇటీవల ఝార్ఖండ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్స వేడుకల్లో మాట్లాడిన ఖుష్బూ.. ‘మా నాన్న వల్ల అమ్మ, నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అమ్మను, నన్ను ఎప్పుడూ కొడుతుండేవాడు. నాకు 8 ఏళ్ల వయసప్పుడే లైంగికంగా వేధించాడు. 15 సంవత్సరాల వయసులో ఆయన్ను ఎదిరించే ధైర్యం వచ్చింది. ఆ తరువాత ఇంట్లో ఉన్నవన్నీ తీసుకుని ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు.’ అని చెప్పారు. ఆ కామెంట్స్ పెను సంచలనం సృష్టించగా.. తాజాగా తన కామెంట్స్ స్పందించారు. జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నానని, ఇందులో సిగ్గుపడే అంశం ఏమీ లేదని చెప్పుకొచ్చారు ఖుష్బూ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..