ప్రియా వారియర్ తో ఇకపై నటించను..!

ప్రియా వారియర్ తో ఇకపై నటించను..!

కన్నుగీటి… రాత్రికి రాత్రే ఫేమస్ అయిపొయింది మలయాళీ భామ ప్రియా వారియర్. అయితే ఈమె నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ సినిమా తెలుగులో వాలెంటైన్స్ డే కానుకగా ‘లవర్స్ డే’ పేరుతో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ అసలు బాగోలేదని ప్రేక్షకుల టాక్. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నటించిన ఇద్దరి హీరోయిన్స్ మధ్య గొడవ జరిగిందని టాక్.       ఈ సినిమాలో ప్రియా వారియర్ తో కలిసి […]

Ravi Kiran

|

Feb 21, 2019 | 6:58 PM

కన్నుగీటి… రాత్రికి రాత్రే ఫేమస్ అయిపొయింది మలయాళీ భామ ప్రియా వారియర్. అయితే ఈమె నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ సినిమా తెలుగులో వాలెంటైన్స్ డే కానుకగా ‘లవర్స్ డే’ పేరుతో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ అసలు బాగోలేదని ప్రేక్షకుల టాక్. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నటించిన ఇద్దరి హీరోయిన్స్ మధ్య గొడవ జరిగిందని టాక్.     

 ఈ సినిమాలో ప్రియా వారియర్ తో కలిసి నటించిన మరో హీరోయిన్ నూరిన్ షరీఫ్. చేసింది సపోర్టింగ్ రోల్ అయినా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు లభించాయి. ఇంకా చెప్పాలంటే ప్రియా కన్నా నూరిన్ నటన పరంగా బాగా చేసిందని అటు క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విషయంలో తనకు చాలా అన్యాయం జరిగిందని నూరిన్ అంటోంది. అసలు ఈ సినిమాలో మొదట నన్ను హీరోయిన్ గా తీసుకున్నారు.. కానీ ప్రియ రాత్రికి రాత్రే ఫేమస్ కావడంతో పాత్రలు పూర్తిగా మార్చేశారు. ఇలా చేయడం చాలా అన్యాయం అని ఆమె అన్నారు.  

ఇదంతా ప్రియా వారియర్ వల్లనే జరిగింది అని.. అందుకే భవిష్యత్తులో ఆమెతో కలిసి నటించదు అని ఆమె సన్నిహితులు అంటున్నారు.  కానీ హీరో రోషన్ అబ్దుల్ తో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తుందని వినికిడి. మొత్తానికి ఈ సినిమా వల్ల ఈ ఇద్దరి హీరోయిన్స్ మధ్య పెద్ద గొడవే వచ్చింది.  

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu