పేపర్ డ్రెస్‌‌తో దడ పుట్టిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ

ముంబై: వెరైటీ డ్రెస్‌లు వేసుకుని అందరికీ షాకివ్వడం హీరోయిన్లకు కొత్తేమీ కాదు. సడెన్‌గా విభిన్నంగా డ్రెస్‌లు వేసుకుని ఆశ్చర్యపరుస్తుంటారు. నటి ఆదా శర్మ న్యూస్ పేపర్ డ్రెస్ వేసుకుని దడ పుట్టిస్తోంది. ఎప్పుడూ ఏదొక సందడి చేసే ఈ ముద్దుగుమ్మ న్యూస్ పేపర్‌ను పోలి ఉన్న డ్రెస్‌తో దర్శనమిచ్చింది. ఈ గౌన్‌ను ఫయాజ్ జరీవాలా అనే డిజైనర్ తయారు చేశారట. ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదా శర్మ ఈ వెరైటీ డ్రెస్ లోనే […]

  • Vijay K
  • Publish Date - 8:48 pm, Thu, 21 February 19
పేపర్ డ్రెస్‌‌తో దడ పుట్టిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ

ముంబై: వెరైటీ డ్రెస్‌లు వేసుకుని అందరికీ షాకివ్వడం హీరోయిన్లకు కొత్తేమీ కాదు. సడెన్‌గా విభిన్నంగా డ్రెస్‌లు వేసుకుని ఆశ్చర్యపరుస్తుంటారు. నటి ఆదా శర్మ న్యూస్ పేపర్ డ్రెస్ వేసుకుని దడ పుట్టిస్తోంది. ఎప్పుడూ ఏదొక సందడి చేసే ఈ ముద్దుగుమ్మ న్యూస్ పేపర్‌ను పోలి ఉన్న డ్రెస్‌తో దర్శనమిచ్చింది.

ఈ గౌన్‌ను ఫయాజ్ జరీవాలా అనే డిజైనర్ తయారు చేశారట. ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదా శర్మ ఈ వెరైటీ డ్రెస్ లోనే వచ్చింది. కార్యక్రమంలో ఆద్యంతం ఆదా శర్మ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా కనిపించింది. సోషల్ మీడియాలో కూడా తన ఫొటోను పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.