మరో పవర్‌ఫుల్ పాత్రలో ‘శివగామి’

మరో పవర్‌ఫుల్ పాత్రలో ‘శివగామి’

సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘నరసింహా’ సినిమాలో నీలాంబరి పాత్రకు ప్రాణం పోశారు రమ్యకృష్ణ. ఆ తరువాత అదే స్థాయి పాత్ర ఆమెకు ‘బాహుబలి’ సినిమాల్లోనే దొరికింది. రాజమాత శివగామిగా ఆమె నటనకు ఎన్నో అవార్డులు వరించింది. ఇప్పుడు అంతేస్థాయి పవర్‌ఫుల్ పాత్రలో రమ్యక‌ృష్ణ కనిపించనున్నారు. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ రమ్యకృష్ణతో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు క్వీన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అందులో ప్రముఖ రాజకీయ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 22, 2019 | 6:36 AM

సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘నరసింహా’ సినిమాలో నీలాంబరి పాత్రకు ప్రాణం పోశారు రమ్యకృష్ణ. ఆ తరువాత అదే స్థాయి పాత్ర ఆమెకు ‘బాహుబలి’ సినిమాల్లోనే దొరికింది. రాజమాత శివగామిగా ఆమె నటనకు ఎన్నో అవార్డులు వరించింది.

ఇప్పుడు అంతేస్థాయి పవర్‌ఫుల్ పాత్రలో రమ్యక‌ృష్ణ కనిపించనున్నారు. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ రమ్యకృష్ణతో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు క్వీన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అందులో ప్రముఖ రాజకీయ నాయకురాలి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. రాష్ట్రం మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపే నాయకురాలి పాత్ర ఇదని చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఈ వెబ్ సిరీస్ జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu