కరోనా కాలం.. ఆ ఇద్దరి బాటలోనే నితిన్..!

అనుకోకుండా వచ్చిన కరోనాతో ఇప్పుడు ప్రపంచం మొత్తం అలుపెరగని పోరాటం చేస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ఒక్క వ్యాక్సిన్‌ రెడీ అయినా చాలని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 6:47 pm, Thu, 21 May 20
కరోనా కాలం.. ఆ ఇద్దరి బాటలోనే నితిన్..!

అనుకోకుండా వచ్చిన కరోనాతో ఇప్పుడు ప్రపంచం మొత్తం అలుపెరగని పోరాటం చేస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ఒక్క వ్యాక్సిన్‌ రెడీ అయినా చాలని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వైరస్‌ రావడం వలన చాలా మంది ముందుగా వేసుకున్న ప్లాన్‌లన్నీ తారుమారయ్యాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు చేసుకోవానుకున్న చాలా మంది ఈ వైరస్ రావడంతో తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎలాంటి ఆర్భాటం లేకుండా పెళ్లిని చేసుకున్నారు. వారిలో టాలీవుడ్ నుంచి నిఖిల్, దిల్ రాజు ఉన్నారు. ఈ ఇద్దరు లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. వివాహం చేసుకున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఇదే బాటలో నితిన్‌ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరిలో తన ప్రియురాలు షాలినీతో నిశ్చితార్థం చేసుకున్న నితిన్.. గత నెల 16న ఆమెకు మూడు ముళ్లు వేయాలనుకున్నారు. ఈ మేరకు నితిన్‌ దుబాయ్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ కరోనా రావడంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు నితిన్‌. పరిస్థితులన్నీ చక్కబడ్డ తరువాతే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఇప్పట్లో కరోనా పరిస్థితులు చక్కబడేలా ఉండకపోవడంతో.. సింపుల్‌గా తన పెళ్లిని చేసుకోవాలనుకుంటున్నారట. ఇరువురి సన్నిహితుల మధ్యలో వీరిద్దరి వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డేట్లను కూడా ఖరారు చేసినట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: హరీష్ మల్టీస్టారర్‌ చిత్రం.. హీరోలెవరంటే..!