ఈ నెలాఖరులో చెబుతా.. ప్రామిస్

‘ఛల్ మోహన్ రంగ’ విడుదలై దాదాపుగా ఏడాది అవుతున్నా ఇంతవరకు మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించలేదు యంగ్ హీరో నితిన్. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాకు ఓకే చెప్పినప్పటికీ.. దానిపై తరువాత ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి ఆ మధ్యలో ట్వీట్ చేసిన దర్శకుడు.. నితిన్‌ భుజానికి గాయం తగిలిందని, ఆ గాయం మానిన వెంటనే సినిమాను ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఆ ట్వీట్ చేసి మూడు నెలలు గడిచింది. అయినా […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:46 am, Wed, 6 March 19
ఈ నెలాఖరులో చెబుతా.. ప్రామిస్

‘ఛల్ మోహన్ రంగ’ విడుదలై దాదాపుగా ఏడాది అవుతున్నా ఇంతవరకు మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించలేదు యంగ్ హీరో నితిన్. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాకు ఓకే చెప్పినప్పటికీ.. దానిపై తరువాత ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి ఆ మధ్యలో ట్వీట్ చేసిన దర్శకుడు.. నితిన్‌ భుజానికి గాయం తగిలిందని, ఆ గాయం మానిన వెంటనే సినిమాను ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఆ ట్వీట్ చేసి మూడు నెలలు గడిచింది. అయినా సినిమా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో తదుపరి ప్రాజెక్ట్‌లపై నితిన్ ట్వీట్ చేశాడు.

‘‘నా తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి ఈ నెలాఖరులో చెబుతా. పక్కా, ప్రామిస్. షూటింగ్‌ కూడా త్వరలోనే ప్రారంభిస్తా. అన్ని స్క్రిప్టింగ్‌ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ సంవత్సరం రెండు సినిమాలతో రావాలనుకుంటున్నా. ఆలస్యం అయినందుకు క్షమించండి. సహనంతో ఉన్నందుకు ధన్యవాదాలు. లవ్ యు ఆల్’’ అంటూ నితిన్ కామెంట్ పెట్టాడు.