AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Sarkaru Vaari Paata’: యాక్షన్ మోడ్‌లో సూపర్ స్టార్.. సర్కారు వారి పాట నుంచి న్యూ పోస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

'Sarkaru Vaari Paata': యాక్షన్ మోడ్‌లో సూపర్ స్టార్.. సర్కారు వారి పాట నుంచి న్యూ పోస్టర్
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Apr 02, 2022 | 4:32 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ పెయిర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ , కళావతి, పెన్నీ పాటలను విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.ఆ మధ్య కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయట. యాక్షన్ తోపాటు కావాల్సినంత కామెడీ కూడా ఉండనుందని తెలుస్తుంది. ఈ సినిమా తప్పకుండ బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఏ ఈసినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణంలో వైరల్ అవుతుంది. తాజాగా ఉగాది పురస్కరించుకొని సర్కారు వారి పాట నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ లుక్ ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో మహేష్ యాక్షన్ మోడ్‌ లో కనిపిస్తున్నారు. విలన్స్ ను ఇరగదీయడానికి నడుం బిగిస్తున్న మహేష్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మహేశ్ – వెన్నెల కిశోర్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాను మే 12 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja: మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన టైగర్‌ నాగేశ్వరరావు.. త్వరలోనే షూటింగ్..

Vikrant Rona: మెగాస్టార్స్‌ చేతుల మీదుగా విడుదలైన కిచ్చా సుదీప్‌ సినిమా టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌..

Ugadi 2022 Telugu: శుభకృత్‌ అన్నీ శుభాలే జరగాలని ఉగాది శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, అజయ్ దేవగన్ సహా..పలువురు సెలబ్రెటీలు