ఇంట్రస్టింగ్‌గా ‘అంటే సుందరానికీ’ కర్టన్ రైజర్.. త్వరలో ఆట మొదలు అంటోన్న నాని
దీపావళి సందర్భంగా నాచురల్ స్టార్ నాని మరో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఓ సినిమాలో నటించగా.. ఈ మూవీ ద్వారా మలయాళ కుట్టీ నజ్రియా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు.
Nani Ante Sundaraniki: దీపావళి సందర్భంగా నాచురల్ స్టార్ నాని మరో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఓ సినిమాలో నటించగా.. ఈ మూవీ ద్వారా మలయాళ కుట్టీ నజ్రియా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
కాగా ఇవాళ ఈ మూవీ టైటిల్‌తో పాటు కర్టన్ రైజర్‌ని విడుదల చేశారు. అంటే సుందరానికీ అన్న టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా వచ్చిన వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీ ఫస్ట్‌లుక్‌లో నాని పంచెకట్టు, షర్టుతో ఉండగా.. చేతిలో లగేజ్ బ్యాగ్, కోటు ఉంది. అలాగే సైకిల్, షూస్, వీణ, కెమెరా, పచ్చళ్ల డబ్బాలు, రాశుల చక్రం, ఫ్లైట్ ఉండగా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫార్‌గా పనిచేస్తున్నారు. ఇక ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుండగా.. వచ్చే ఏడాది విడుదల కానుంది.
మరోవైపు ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని టక్ జగదీష్‌లో నటిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. దీని తరువాత రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్‌లో నటించనున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి, క్రితి శెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు.