శర్వా డైరెక్టర్ తో చైతు సినిమా..!

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘మజిలీ’ కాగా.. మరొకటి ‘వెంకీ మామ’. ఇక ఇందులో ‘మజిలీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న విడుదల కానుంది. సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ కోనసీమ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. వీటితో పాటు నాగ చైతన్య మరో టాప్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘ఎక్ప్ ప్రెస్ […]

  • Ravi Kiran
  • Publish Date - 10:46 am, Mon, 25 March 19
శర్వా డైరెక్టర్ తో చైతు సినిమా..!

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘మజిలీ’ కాగా.. మరొకటి ‘వెంకీ మామ’. ఇక ఇందులో ‘మజిలీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న విడుదల కానుంది. సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ కోనసీమ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. వీటితో పాటు నాగ చైతన్య మరో టాప్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘ఎక్ప్ ప్రెస్ రాజా’ ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో యువీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రం చేయబోతున్నాడట. ‘వెంకీ మామ’ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

మరోవైపు చైతు కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నారట. పాత ‘దేవదాస్’ కథ ఆధారంగా ఈ ప్రేమ కథ ఉండబోతోందట. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరూ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ మధ్య వరస ప్లాప్స్ తో సతమతమవుతున్న చైతూ ‘మజిలీ’ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.