Bollywood: స్టార్లు కదా అని అడిగిన వెంటనే లిఫ్ట్ ఇచ్చారు.. కట్ చేస్తే.. దిమ్మతిరిగేలా షాక్..

ముంబై మహానగరం.. కోట్లాది మంది జనాభా.. లక్షలాది వాహనాలు.. ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే, చాలామంది ప్రముఖులు ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకునేందుకు బైక్స్ మీద ప్రయాణిస్తుంటారు.

Bollywood: స్టార్లు కదా అని అడిగిన వెంటనే లిఫ్ట్ ఇచ్చారు.. కట్ చేస్తే.. దిమ్మతిరిగేలా షాక్..
Amitabh Bachchan - Anushka Sharma
Follow us

|

Updated on: May 17, 2023 | 6:34 PM

ముంబై మహానగరం.. కోట్లాది మంది జనాభా.. లక్షలాది వాహనాలు.. ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే, చాలామంది ప్రముఖులు ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకునేందుకు బైక్స్ మీద ప్రయాణిస్తుంటారు. ఇటీవల ట్రాఫిక్‌ నుంచి తప్పించుకునేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, హీరోయిన్ అనుష్క శర్మ ట్రాఫిక్ లో చిక్కుకుని.. కారు వదిలి బైక్‌పై ప్రయాణించారు. వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇద్దరూ.. వారు ఇతరుల బైక్‌లను ఆశ్రయించారు. అయితే వారికి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తులు హెల్మెట్లు ధరించకపోవడం ముంబయి ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరింది. దీంతో ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్.. చర్యలు ప్రారంభించి జరిమానాలు విధించింది.

ఇటీవల అమితాబ్ ఎవరో వ్యక్తి బైక్‌పై షూటింగ్‌ కు వెళ్తూ ముంబైలో కనిపించారు. అయితే, తనకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్‌ చెప్పారు. నువ్వు ఎవరో నాకు తెలీదు.. కానీ సమయానికి నన్ను షూటింగ్‌ కు తీసుకువచ్చావు.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావంటూ అమితాబ్ బైకర్ తో పేర్కొన్నారు. అనుష్క శర్మ కూడా కారులో స్టూడియోకి వెళ్తున్న క్రమంలో చెట్టు పడి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆమె కూడా ఓ వ్యక్తి బండి మీద స్టూడియోకు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, పనిపట్ల వీరికున్న నిబద్ధతను కొందరు ప్రశంసించగా.. మరికొందరు మాత్రం హెల్మెట్లు ధరించలేదంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో.. వారు ట్రాఫిక్ పోలీసులకు చెప్పారు. దీంతో ముంబై ట్రాఫిక్‌ పోలీసులు ఆ బైకర్లకు జారీ చేసిన చలాన్లను ట్విటర్ వేదికగా షేర్‌ చేశారు. అనుష్కకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికి రూ.10,500 చలానా విధించగా.. అమితాబ్‌ను తీసుకెళ్లిన వ్యక్తికి రూ.1000 జరిమానా విధించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం..