AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి ట్విస్ట్ మావ..! పెళ్లి కాలేదు.. కానీ బేబీ బంప్‌తో కనిపించిన హీరోయిన్..

ఒకప్పుడు సీరియల్స్ ద్వారా జనాలకు దగ్గరయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. నటనపై ఆసక్తితో ఆత్మ విశ్వాసంతో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటుంది.

ఇదెక్కడి ట్విస్ట్ మావ..! పెళ్లి కాలేదు.. కానీ బేబీ బంప్‌తో కనిపించిన హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2026 | 7:13 PM

Share

హీరోయిన్స్‌కు సంబందించిన ఫోటోలు, వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్ అవుతుంటాయి. తమ అభిమాన హీరోయిన్ ఫొటోలతో పాటు చిన్ననాటి ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటో, వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. మొన్నటివరకు ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఇంతలోనే ఆమె బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది. ఆ స్టార్ హీరోయిన్ బేబీ బంప్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సడన్ గా ఆమె బేబీ బంప్ తో కనిపించడంతో అందరూ అవాక్ అవుతున్నారు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె పేరు చెప్తే షాక్ అవ్వాల్సిందే..

ఆమె మరెవరో కాదు సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. అందాల భామ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది. హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది. మృణాల్ కు ఎక్కువగా క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంది. అయితే ఫ్యామిలీ మ్యాన్ సినిమా తర్వాత మృణాల్ సైలెంట్ అయ్యింది. ఈ సినిమా నిరాశపరచడంతో మృణాల్ కు అంతగా ఆఫర్స్ రావడం లేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్  బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే ఈమె ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి ఇది నిజంగానే జరిగిందా.? అంటూ ఆశ్చర్యపోతున్నారు. పింక్ కలర్ డ్రెస్ ధరించి బేబీ బంప్ తో కనిపించింది మృణాల్. అయితే ఈమె చేతిని పట్టుకొని బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా కనిపించాడు. ఈ ఇద్దరూ కలిసి హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వీడియో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..