AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neelakurinji Flower: పన్నెండు ఏళ్లకు ఒక్కసారి పూసే పువ్వు .. దీని ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?

మనకు పన్నిండేళ్లకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయని తెలుసు. కానీ 12 సంవత్సరాలకు ఒక్కసారే ఆ చెట్టుకు పువ్వులు పూస్తాయి. అందులోను ఈపువ్వులు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మాత్రమే కనిపిస్తాయి. ఇలా విరబూసిన పూలతోటి ఆ ప్రాంతం ఒక సుందర సౌందర్య చిత్రాన్ని ప్రకృతిలో ఆవిష్కరిస్తుంది. అయితే ఈ పూలు పూసే చెట్లు అంతరించి పోతున్నాయనే ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతకీ అసలు ఆ పువ్వు ఏది.. ఏ ప్రాంతంలో కనిపిస్తుంది. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.

Neelakurinji Flower: పన్నెండు ఏళ్లకు ఒక్కసారి పూసే పువ్వు .. దీని ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?
Neelakurinji Flower
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 05, 2026 | 7:25 PM

Share

పశ్చిమకనుమల్లో ప్రతి పన్నెడు ఏళ్లకు ఒక్కసారి పూసే పువ్వులు “నీల కురింజి”. దక్షిణ భారతదేశంలో కేరళ , తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల పశ్చిమకనుమల్లో ఇవి అరుదుగా పూస్తుంటాయి. ఇవి విరబూసినపుడు ఆ పర్వతాలు సముద్రంలా నీలిరంగులోకి మారిపోతాయి. వాటిని చూస్తూ పర్యాటకులు మంత్ర ముగ్దులు అవుతారు. టొడా గిరిజన తెగకు ఈ పువ్వులు పవిత్రమైనవి. పునర్జన్మ , వయస్సు , ఋతువులు లకు ఇవి ప్రామాణికమైనవని ఆ జాతి సంప్రదాయం. 2018లో చివరిగా ఈ పువ్వులు కనిపించాయి మళ్ళీ వీటిని చూడాలంటే 2030 వరకు ఆగాల్సిఉంటుంది.

తమిళంలో కురుంజి , మలయాళం లో నీలకురుంజి, కన్నడలో గురిగే అని ఈ చెట్లను స్థానికులు పిలుస్తారు. ఇక నీల కురుంజి మొక్కలు వల్లే నీలగిరి పర్వతాలకు ఆపేరు వచ్చిందని చెబుతారు. సముద్రమట్టానికి 1300 నుంచి 2600 ల మీటర్ల ఎత్తులో పొదల్లా ఇవి పెరుగుతాయి. 30 నుండి 60 సెంటీమీటర్ల ఎత్తు పెరిగి ఊదా , నీలిరంగు పువ్వులు పూస్తాయి. తమిళనాడులో ఈ పువ్వులు పుష్పించే కాలానికి అనుగుణంగా తమ వయస్సును పాలియన్ గిరిజన తెగ లెక్కిస్తుందని అక్కడి వారు చెబుతారు. అయితే పశ్చిమ కనుమల్లో పెరుగుతున్న టీ , కాఫీ తోటలు , పర్యాటక రంగం విస్తరణ తో నీలకురుంజి అంతరించి పోయే ప్రమాదం ఏర్పడింది .

ఈ క్రమంలో బొటానికల్ సెర్వే ఆఫ్ ఇండియా – బి ఎస్ ఐ , ఈ మొక్కకు ఎదురవుతున్న ప్రమాదాలను అంచనా వేయటానికి ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ లో వున్న ముగ్గురు సభ్యులు బాబాబుదాన్ గిరి , కుడ్రేముఖ్ , అన్నామలై , ఎరవికులం , నీలగిరి , పలని పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఈ మొక్కలకు ఎదురవుతున్న సవాళ్ళ పై పరిశోధనలు జరపబోతున్నారు.

పర్యావరణ , అడవులు – వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ , బి ఎస్ ఐ లు ఈ మొక్కను ప్రత్యేక పర్యావరణ , సింబాలిక్ ప్రాధాన్యత ఉన్నట్లు గుర్తింపు ఇస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలిపింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కాన్సెర్వేషన్ ఆఫ్ నేచర్ జాబితాలో చేరటంతో ఈ మొక్కకు 2024 తరువాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..
అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..
రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్
రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్
ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్
ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్
రూ.10 వేలలోపు పెట్టుబడితో ట్రెండీ బిజినెస్!
రూ.10 వేలలోపు పెట్టుబడితో ట్రెండీ బిజినెస్!
'ధురంధర్ 2' డైరెక్టర్ భార్య తెలుగులో ఫేమస్ హీరోయిన్ అని తెలుసా?
'ధురంధర్ 2' డైరెక్టర్ భార్య తెలుగులో ఫేమస్ హీరోయిన్ అని తెలుసా?
నిమ్మకాయ రసం Vs కొబ్బరి నీళ్లు.. వేసవిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..
నిమ్మకాయ రసం Vs కొబ్బరి నీళ్లు.. వేసవిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..
ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ మావే..అన్ని జెర్సీలు వేసిన అరుదైన ఆటగాళ్లు
ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ మావే..అన్ని జెర్సీలు వేసిన అరుదైన ఆటగాళ్లు
డబుల్ బెడ్ రూం ఇళ్లపై రేవంత్ సర్కార్ బిగ్ అప్డేట్
డబుల్ బెడ్ రూం ఇళ్లపై రేవంత్ సర్కార్ బిగ్ అప్డేట్
ఐపీఎల్ ఫైనల్స్‌లో ఓటమి ఎరుగని కెప్టెన్లు.. లిస్ట్ చూస్తే షాకే
ఐపీఎల్ ఫైనల్స్‌లో ఓటమి ఎరుగని కెప్టెన్లు.. లిస్ట్ చూస్తే షాకే
ఇంత పైత్యమా..?ప్రీ-వెడ్డింగ్ షూటా లేక సూసైడ్ ప్రాక్టీసా? వైరల్
ఇంత పైత్యమా..?ప్రీ-వెడ్డింగ్ షూటా లేక సూసైడ్ ప్రాక్టీసా? వైరల్