AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2026 Final : ఫైనల్ పోరుకు రంగం సిద్ధం..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే

 WPL 2026 Final :మహిళల క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. వడోదరలోని బీసీఏ స్టేడియం సాక్షిగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, రెండు జట్ల గౌరవానికి సంబంధించిన విషయం.

WPL 2026 Final : ఫైనల్ పోరుకు రంగం సిద్ధం..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
Rcb Vs Dc
Rakesh
|

Updated on: Feb 05, 2026 | 6:53 PM

Share

WPL 2026 Final :మహిళల క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. వడోదరలోని బీసీఏ స్టేడియం సాక్షిగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, రెండు జట్ల గౌరవానికి సంబంధించిన విషయం. వడోదరలోని బీసీఏ స్టేడియం, కోటంబి వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్‌సీబీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలవడంతో ఆర్‌సీబీకి ఈ అవకాశం దక్కింది. మరోవైపు, జెమిమా రోడ్రిగ్స్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేటర్ మ్యాచులో విజయం సాధించి ఇక్కడిదాకా వచ్చింది. అయితే ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో ఫైనల్ కావడం గమనార్హం. గత మూడుసార్లు ఫైనల్ చేరినా ట్రోఫీ ముద్దాడలేకపోయిన ఢిల్లీ, ఈసారి ఎలాగైనా చోకర్స్ ట్యాగ్ పోగొట్టుకోవాలని కసిగా ఉంది.

వడోదర పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటికీ, ఆట గడిచేకొద్దీ స్పిన్నర్లకు కీలకంగా మారుతుంది. ఇక్కడ 160 పరుగులకు పైగా స్కోరు చేస్తే దానిని ఛేదించడం చాలా కష్టమని గత గణాంకాలు చెబుతున్నాయి. అందుకే టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో కేవలం ఒకసారి మాత్రమే 160కి పైగా స్కోరును టీమ్స్ ఛేజ్ చేయగలిగాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచింది. వెంటనే ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఆర్‌సీబీ తన బౌలింగ్ బలంతో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని ప్లాన్ చేస్తోంది.

ప్లేయింగ్ ఎలెవన్ :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), గ్రేస్ హారిస్, జార్జియా వోల్, రాధా యాదవ్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), నాడిన్ డి క్లర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, సయాలి సత్ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్.

ఢిల్లీ క్యాపిటల్స్: లిజెల్ లీ (వికెట్ కీపర్), షెఫాలీ వర్మ, లారా వోల్వార్డ్, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మరిజన్నే కాప్, చినెల్ హెన్రీ, నిక్కీ ప్రసాద్, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందిని శర్మ.

Follow Us
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
డెలాయిట్‌లో మంచి జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. ఇప్పుడు ఆయనే..
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ప్రెగ్నెంట్ అయినా ఫిట్‌నెస్‌ తప్పనిసరి అంటున్న నటి
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. థియేటర్లలో యూత్ ఎగబడి చూశారు
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
సబ్జా vs చియా సీడ్స్.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మంట పుట్టిస్తున్న సమ్మర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
కోపాన్ని మోస్తుంటే ఏం జరుగుతుందో సైకాలజిస్టుల మాట
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అక్బర్, టిప్పు సుల్తాన్ మెచ్చిన రాజరికపు రుచి.. వీధి చిరుతిండి..
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
అందం కోసం ఆరాటంలో జెన్‌ ఆల్ఫా.. కోల్పోతున్నది ఏంటి
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!
ఇంటర్ ఫలితాల్లో2026 అమ్మాయిల సత్తా.. మేడ్చల్‌ జిల్లా టాప్!