AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Channa Masala Recipe: చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్! పంజాబీ దాబా స్టైల్ చన్నా మసాలా రెసిపీ..

చపాతీలు లేదా పూరీలు చేసుకున్నప్పుడు మనం సాధారణంగా చేసే కూరలే తిని బోర్ కొట్టిందా? అయితే, పంజాబీ ధాబాల్లో దొరికే ఆ కమ్మని, ఘుమఘుమలాడే చన్నా మసాలాను ఒకసారి ట్రై చేయండి. దీని ప్రత్యేకత అంతా మనం గ్రైండ్ చేసే మసాలా చివర్లో ఇచ్చే నెయ్యి తాలింపులోనే ఉంది. కేవలం శనగలతో మాత్రమే కాకుండా, ఉడికించిన బంగాళాదుంపను కూడా జోడించడం వల్ల ఈ గ్రేవీకి హోటల్ స్టైల్ చిక్కదనం రుచి వస్తాయి.

Channa Masala Recipe: చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్! పంజాబీ దాబా స్టైల్ చన్నా మసాలా రెసిపీ..
Punjabi Dhaba Style Channa Masala
Bhavani
|

Updated on: Feb 05, 2026 | 7:04 PM

Share

చాలా మంది హోటల్ స్టైల్ చన్నా మసాలా ఇంట్లో రావడం లేదని అనుకుంటారు. కానీ, శనగలను ఉడికించేటప్పుడు వాడే బిర్యానీ ఆకు, నల్ల ఏలకుల నుండి.. చివర్లో వాడే కసూరి మేథీ వరకు ప్రతిదీ దీని రుచిని పెంచుతాయి. ముఖ్యంగా ఉడికించిన శనగలను, పెరుగును కలిపి గ్రైండ్ చేయడం వల్ల గ్రేవీకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. పంజాబీ స్టైల్‌లో ఉండే ఈ స్పెషల్ చన్నా మసాలా తయారీ విధానం మరియు అందులోని ముఖ్యమైన మసాలా దినుసుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు :

ఉడికించడానికి: తెల్ల శనగలు (1 కప్పు – 8 గంటలు నానబెట్టినవి), బంగాళాదుంప (1), బిర్యానీ ఆకు, నల్ల ఏలకులు (3).

గ్రైండింగ్ కోసం: పచ్చిమిర్చి (2), వెల్లుల్లి (5), అల్లం (2 అంగుళాలు), చిక్కటి పెరుగు (3 టేబుల్ స్పూన్లు), సగం ఉడికించిన బంగాళాదుంప, కొన్ని ఉడికించిన శనగలు.

తయారీకి: ఉల్లిపాయ తరుగు, పసుపు, కారం, ధనియాల పొడి, చన్నా మసాలా, ఉప్పు, నూనె.

స్పెషల్ తాలింపు: నెయ్యి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కసూరి మేథీ, ఇంగువ, కాశ్మీరీ కారం పొడి.

తయారీ విధానం :

కుక్కర్‌లో నానబెట్టిన శనగలు, బిర్యానీ ఆకు, నల్ల ఏలకులు, బంగాళాదుంప వేసి 6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.

ఉడికించిన శనగల్లో నుంచి కొన్నింటిని, సగం బంగాళాదుంపను తీసుకుని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మరియు పెరుగుతో కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

పాన్‌లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, చన్నా మసాలా వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి.

గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించిన తర్వాత.. ఉడికించిన శనగలను (నీళ్లతో సహా) మరియు మిగిలిన బంగాళాదుంప ముక్కలను వేసి 10 నిమిషాలు ఉడికించాలి.

చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి ఎండుమిర్చి, అల్లం తరుగు, కసూరి మేథీ, ఇంగువ, కాశ్మీరీ కారం వేసి వేయించి, ఆ తాలింపును చన్నా మసాలాలో కలపాలి. చివర్లో కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి పంజాబీ చన్నా మసాలా రెడీ!

బంగాళాదుంపలు, శనగలతో దాబా స్టైల్ చన్నా మసాలా రెడీ!
బంగాళాదుంపలు, శనగలతో దాబా స్టైల్ చన్నా మసాలా రెడీ!
జబర్దస్త్‌లో అది నిజంగానే జరుగుతుంది.. షాకింగ్ విషయం చెప్పిన వర్ష
జబర్దస్త్‌లో అది నిజంగానే జరుగుతుంది.. షాకింగ్ విషయం చెప్పిన వర్ష
12 ఏళ్లకు ఒక్కసారి పూసే పువ్వు .. దీని ప్రత్యేక ఏంటో మీకు తెలుసా?
12 ఏళ్లకు ఒక్కసారి పూసే పువ్వు .. దీని ప్రత్యేక ఏంటో మీకు తెలుసా?
ఫైనల్ పోరుకు రంగం సిద్ధం..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఫైనల్ పోరుకు రంగం సిద్ధం..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
వంకాయ ప్రియులకు పండగే! దీంతో కూర రుచి డబుల్!
వంకాయ ప్రియులకు పండగే! దీంతో కూర రుచి డబుల్!
మేడారంలో బాలికపై అత్యాచారం ఆరోపణలు.. ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?
మేడారంలో బాలికపై అత్యాచారం ఆరోపణలు.. ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?
ఎండలో ఉన్నా విటమిన్ డి లోపం ఎందుకు వస్తోంది?
ఎండలో ఉన్నా విటమిన్ డి లోపం ఎందుకు వస్తోంది?
భారతదేశం రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కింది: ప్రధాని మోదీ
భారతదేశం రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కింది: ప్రధాని మోదీ
నాకు అలవాటు ఉంది.. కానీ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా.!
నాకు అలవాటు ఉంది.. కానీ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా.!
'మన శంకరవరప్రసాద్ గారు' కి 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
'మన శంకరవరప్రసాద్ గారు' కి 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?