Wild Dog Review: అసలైన థ్రిల్లింగ్ అంటే ఎంటో చూపించిన నాగార్జున.. ఇంట్రెస్టింగ్‏గా ‘వైల్డ్ డాగ్’..

Wild Dog Twitter Review: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'వైల్డ్ డాగ్'.

Wild Dog Review: అసలైన థ్రిల్లింగ్ అంటే ఎంటో చూపించిన నాగార్జున.. ఇంట్రెస్టింగ్‏గా 'వైల్డ్ డాగ్'..
Wild Dog
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 02, 2021 | 11:10 AM

Wild Dog Twitter Review: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘వైల్డ్ డాగ్’. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్‏కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్‏గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో సయామీ ఖేర్ కీలక పాత్రలో నటించింది. దీనికి థమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా ప్రారంభం నుంచి నాగార్జున అభిమానులు ఈ మూవీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలై ట్రైలర్‏కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విజయ్ వర్మ పాత్రలో నటించిన నాగ్ లుక్‏కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. హైదరాబాద్‏లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు.

Wild Dog 3

Wild Dog 3

హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్ల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 2న ఘనంగా విడుదలైంది. ఈ సినిమాను ముందే చూసిన ప్రీమియర్ ఆడియన్స్ పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. సినిమా చాలా బాగుందని.. ఫస్టాఫ్ సూపర్ అని.. ఎక్కడ కూడా కథను పక్కదారి పట్టించకుండా…. స్టోరీపైనే ఫోకస్ పెడుతూ.. డైరెక్టర్ కథను నడిపించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ నాగ్ అదరగొట్టేశారని.. ఇక ఎస్కేపింగ్ సీన్ సూపర్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే సెకండాఫ్ కూడా చాలా థ్రిల్లింగ్‏గా తీశారని.. నాగ్ అసలైన థ్రిల్లింగ్ అంటే ఎంటో చివరి 20 నిమిషాల్లో చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే క్లైమాక్స్ సీన్స్, ఎమోషన్ సీన్స్ కూడా అద్భుతంగా తీసారని ట్వీట్ చేస్తున్నారు. ఇక ఇందులో నాగ్ ఏసీపీ పాత్రలో ఒదిగిపోయారని.. కానీ అక్కడక్కడ కాస్తా సాగదీశారని కామెంట్స్ చేశారు.

ట్వీట్స్..

Also Read:

Sarangadariya: ‘లవ్‏స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. పైర్ అవుతున్న నెటిజన్స్..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..