AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reyiki Veyi Kallu: రేయికి వేయికళ్లు.. ఈ వీకెండ్ ‘ఆహా’లో మర్డర్ మిస్టరీపై రెండు కళ్లు వేయొచ్చు..

ఆహా ఓటీటీ రిలీజైన రేయికి వేయి కళ్లు మూవీ ఎలా ఉంది. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందా..? ఈ వీకెండ్ టైమ్ కేటాయించవచ్చా..?

Reyiki Veyi Kallu: రేయికి వేయికళ్లు.. ఈ వీకెండ్ ‘ఆహా’లో మర్డర్ మిస్టరీపై రెండు కళ్లు వేయొచ్చు..
Reyaki Veye Kanulu Film
Ram Naramaneni
|

Updated on: Sep 30, 2022 | 9:34 PM

Share

మూవీ రివ్యూ: రేయికి వేయి కళ్లు నటీనటులు: అరుళ్ నిధి స్టాలిన్, మహిమ నంబియార్, అజ్మల్ అమీన్ తదితరులు సంగీతం: శ్యామ్ సిఎస్ సినిమాటోగ్రఫీ: అరవింద్ సింగ్ ఎడిటింగ్: శాన్ లోకేష్ దర్శకుడు: ము. మారన్

డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో అరుళ్‌నిధి స్టాలిన్. తాజాగా ఈయన నటించిన ఓ సినిమాను తెలుగులో రేయికి వేయి కళ్లు పేరుతో ఆహాలో విడుదల చేసారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? ఈ వారం ప్రేక్షకులు డిజిటల్‌లో చూడొచ్చా..

కథ

భరత్ (అరుల్ నిధి స్టాలిన్) ఓ క్యాబ్ డ్రైవర్. అతడు సుశీల (మహిమ నంబియార్)‌తో తో ప్రేమలో ఉంటాడు. మరోవైపు అమ్మాయిలను బుట్టలో వేసుకొని వాళ్లను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు గణేష్ (అజ్మల్ అమీన్). భరత్ ప్రేమిస్తున్న సుశీల వెంట పడి వేధిస్తుంటాడు గణేష్. అదే సమయంలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన మురుగన్ (ఆనంద్ రాజ్), వసంత్ (జాన్ విజయ్) దంపతులను బెదిరించి భారీగా డబ్బులు గుంజేస్తాడు. ఈ క్రమంలోనే తన ప్రేయసిని వేధిస్తున్న గణేష్‌ను భరత్ వెంటాడుతున్న సమయంలో ముఠాలో ఉండే మాయ హత్య జరుగుతుంది. ఆ హత్యా నేరం భరత్‌పై పడుతుంది. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అసలు సుశీలను గణేష్ ఎందుకు వేధిస్తుంటాడు.. ఆ నేరం నుంచి భరత్ ఎలా బయటపడ్డాడు..? బిజినెస్ మ్యాన్ మురుగన్‌ను గణేష్ ఎందుకు మోసం చేసాడు..? దానికి మురుగన్ ఏం చేసాడు..? వీటి చుట్టూ సాగుతుంది రేయికి వేయికళ్లు కథ..

కథనం:

ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగుతుంది. పైగా ఇలాంటి కథలు అరుదుగానే వస్తుంటాయి కూడా. అరుళ్ నిధి స్టాలిన్, మహిమ మధ్య ప్రేమకథతో కథ మొదలవుతుంది. అప్పటి వరకు హాయిగా సాగుతున్న కథలోకి విలన్ అజ్మల్ ఎంట్రీ ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనొచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే మరింత వేగంగా మారిపోతుంది. ముఖ్యంగా అందమైన అమ్మాయిలకు వలేయడం.. వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేయడంతో కథనం వేగవంతం అవుతుంది. అదే సమయంలో 50 ఏళ్ల వయసులో 25 అమ్మాయితో సహజీవనం చేయాలనుకొనే బిజినెస్ మ్యాన్ ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్లను విలన్ మోసం చేయడం.. ఆ బ్లాక్ మెయిలింగ్ ఎపిసోడ్ లాంటి సీన్స్‌తో ఫస్టాఫ్ అంతా వేగంగా వెళ్లిపోతుంది. ఇలా సాగుతున్న కథలో మాయ హత్య మరో మలుపు. ఆ హత్య తర్వాత గణేష్ కూపీ లాగుతుండటంతో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. వసంత్ భార్య బ్లూ ఫిలిం వీడియో వ్యవహారం, బ్లాక్ మెయిల్ లాంటి అదిరిపోయే ట్విస్టులు. అసలు మాయను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనే విషయాలు మరింత ఆసక్తికరంగా మార్చుతాయి సినిమాను. కథ చిన్నదే అయినా కూడా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు ము మారన్.

నటీనటులు:

అరుల్ నిధి స్టాలిన్ చాలా బాగా నటించాడు. పక్కింటి అబ్బాయిగా కనిపిస్తాడు. భరత్ పాత్రకు చక్కగా సరిపోయాడు. సెకండాఫ్‌లో అరుల్ నిధి నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. రంగం ఫేమ్ అజ్మల్ అమీన్ మరోసారి తన విలనిజంతో అదరగొట్టాడు. సినిమాకు ఆయన పాత్ర ప్రాణం. సీనియర్ నటుడు ఆనంద్ రాజ్ చాలా రోజుల తర్వాత ఫన్నీ రోల్ చేసాడు. జాన్ విజయ్ పాత్ర బాగా నవ్విస్తుంది. హీరోయిన్ మహిమా నంబియార్ క్యూట్‌గా ఉంది.. చిన్న పాత్రే అయినా బాగా చేసింది.

టెక్నికల్ టీం:

మొన్న రామారావు ఆన్ డ్యూటీకి సంగీతం అందించిన సామ్ సీఎస్ దీనికి ఆర్ఆర్ చేసాడు. సినిమాలోని కొన్ని సీన్స్‌ను తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో నిలబెట్టాడు సామ్ సిఎస్. అరవింద్ సింగ్ సినిమాటోగ్రఫి అదిరిపోయింది. నైట్ ఎఫెక్ట్ షాట్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. శాన్ లోకేష్ ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు మారన్ రాసుకున్న కథకు చాలా చక్కగా కథనం జోడించి తెరకెక్కించాడు.

పంచ్ లైన్:

రేయికి వేయికళ్లు.. ఈ వీకెండ్ ‘ఆహా’లో మర్డర్ మిస్టరీపై రెండు కళ్లు వేయొచ్చు..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..