AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchan: మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా ’ తొలి పాటను విడుదల చేసి బాలీవుడ్ మెగాస్టార్

Son Of India Movie: సీనియర్ హీరో మోహన్ బాబు గత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇటీవల సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో కీలక పాత్రలో

Amitabh Bachchan: మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా ’ తొలి పాటను విడుదల చేసి బాలీవుడ్ మెగాస్టార్
Mohan Babu Son Of India
Shaik Madar Saheb
|

Updated on: Jun 15, 2021 | 1:53 PM

Share

Son Of India Movie: సీనియర్ హీరో మోహన్ బాబు గత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇటీవల సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. తాజాగా సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మోహన్ బాబు. ఈ చిత్రానికి డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తుండగా.. శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే.. ఇప్పటికే చిరంజీవి వాయిస్ ఓవర్‌తో విడుదలైన ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత మోహన్ బాబు పూర్తి స్థాయి మాస్ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘జయ జయ మహావీర’ లిరికల్ సాంగ్‌ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు.

ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. మోహన్ బాబు దాదాపు 500 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో మెప్పించారు. తాజాగా ఇప్పుడు దేశ భక్తి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.