Mohan babu: తక్కువ మాట్లాడమని చెప్పగానే షాక్ అయ్యాను.. జిన్నా ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం జిన్నా. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోనీ హీరోయిన్‌లగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. మోహన్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రం..
మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం జిన్నా. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోనీ హీరోయిన్‌లగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. మోహన్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌లో తనను తక్కువ మాట్లాడని విష్ణు చెప్పాడని, అది వినగానే షాక్‌కి గురయ్యాను అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
ఈ విషయమో మోహన్ బాబు మాట్లాడుతూ..’ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ.. ఇలా ఎందరో హీరోల వేడుకల్లో.. చివరికి అబ్దుల్ కలాం మా విద్యా సంస్థకు వచ్చినప్పుడూ ‘ఇన్ని నిమిషాలే మాట్లాడాలి’ అని ఎవరూ నాకు చెప్పలేదు. కానీ, విష్ణు నన్ను ఈ రోజు తక్కువగా మాట్లాడాలన్నాడు. అది విని షాక్ అయ్యా. ‘పెద్దవాళ్లు చెప్పలేదు కదా.. అయినా నేను ఎక్కువగా మాట్లాడతా’ అని అనిపించింది. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. బిడ్డలను పదిమందిలో పొడగకూడదంటుంటారు’ అని చెప్పుకొచ్చారు.
జిన్నా చిత్రంలో విష్ణు ఎంత గొప్పగా నటించాడో నటీనటులు, సాంకేతిక నిపుణులు చెప్పాక, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని మోహన్ బాబు అన్నారు. ఇక ఏ సినిమాకూ కష్టపడనంత విధంగా విష్ణు ‘జిన్నా’కు కష్టపడ్డాడని, ఈ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవాకు మోహన్ బాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..