Drishyam 2 Review: ‘దృశ్యం’ను మించిన ట్విస్టులు.. ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తున్న మోహన్ లాల్ ‘దృశ్యం 2’..

ఆరు సంవత్సరాల క్రితం మలయాళంలో సెన్సెషనల్ హిట్ సాధించిన సినిమా దృశ్యం. ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యి..

Drishyam 2 Review: 'దృశ్యం'ను మించిన ట్విస్టులు.. ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తున్న మోహన్ లాల్ 'దృశ్యం 2'..
Follow us

|

Updated on: Feb 19, 2021 | 4:00 PM

సినిమా: దృశ్యం -2 నటీనటులు: మోహన్ లాలా, మీనా, అన్సిబా, ఎస్తేర్ అనిల్, మురళి గోపి, ఆశా శరత్, సిద్ధిఖ్, తదితరులు రచన, దర్శకత్వం: జీతు జోసెఫ్ నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్ సంగీతం: అనిల్ జాన్సన్ ఛాయాగ్రహణం: సతీష్ కురుప్

ఆరు సంవత్సరాల క్రితం మలయాళంలో సెన్సెషనల్ హిట్ సాధించిన సినిమా దృశ్యం. ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యి.. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా సిక్వెల్‏ను మరోసారి మలయాళంలో తెరకెక్కించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించగా.. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‏లో విడుదల చేశారు. ఆ సినిమా రివ్యూ మీకోసం.

దృశ్యం.. సినిమాలో తన కుటుంబం జోలికి వచ్చిన వరుణ్‏ను కూతురు హత్య చేయడం.. ఆ మృతదేహాన్ని ఎవరూ ఉహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెడతాడు జార్జి కుట్టి (మోహన్ లాల్). ఇక ఆ తర్వాత జార్జి తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. కానీ ఆ కేసును మాత్రం పోలీసులు వదిలి పెట్టరు. జార్జికి తెలియకుండా ఆ కేసును ఇంకా దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని కీలక సాక్ష్యాలు దొరుకుతాయి. ఆ సాక్ష్యాలెంటీ.. మళ్లీ వాటి వలన జార్జి కుటుంబానికి ఎదురైన సమస్యలు, చివరికి ఏమైంది అనేది కథ.

దృశ్యం 2ను గతేడాది మొదలు పెట్టి కరోనా కారణంగా వాయిదా వేశారు. లాక్ డౌన్ అనంతరం తిరిగి ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభించి కేవలం నెలన్నరలో పూర్తిచేశారు. థియేటర్లను కాదని.. ఓటీటీలో విడుదల చేయడం పట్ల మొదట్లో చాలా విమర్శలు వెలువడ్డాయి.. కానీ సినిమా చూశాక ప్రేక్షకుల అభిప్రాయం మారిపోతుందనే చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి ఆసక్తి రేకెత్తిస్తూ.. అనుహ్యా మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ.. చివరికి సూపర్ అనిపించేలా ఈ మూవీని ముగించేశారు. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో సిక్వెల్‏గా వచ్చి.. సూపర్ హిట్ అయిన సినిమా ఏదైన ఉందంటే అది దృశ్యం 2 అనుకోవాల్సిందే.

దృశ్యం సినిమా ముగింపు నుంచి దృశ్యం 2 ప్రారంభమవుతుంది. వరుణ్ హత్య కేసు నుంచి తెలివిగా బయటపడ్డాక.. జార్జి కుట్టి తనకున్న సినిమా పిచ్చితో సొంతంగా థియేటర్ ఓపెన్ చేస్తాడు. అయితే జార్జికి తెలియకుండా ఈ కేసును పోలీసులు రహస్యంగా ఎంక్వైరీ చేస్తుండగా.. కొన్ని ఆధారాలు పోలీసులకు చిక్కడం నుంచి కథ ఆసక్తికగా మారుతుంది. ఈ కేసులో జార్జి విషయంలో పోలీసులు ఎలా డీల్ చేశారు.. అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్లాన్స్ చేశారనేవి ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటాయి. పోలీసులకు ధీటుగా జార్జి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేసే ప్లాన్స్ తోపాటు ప్రేక్షకులు కూడా ఏమాత్రం ఉహించని ట్విస్టులతో ఈ సినిమా కొనసాగుతుంది. ఇందులోని పాత్రలలో జార్జితో సహ ప్రతి ఒక్కరు జీవించేశారు. సినిమాలో కలిగే ట్విస్టులతోపాటు.. జార్జి కుట్టి తన పాత్ర పట్ల ఒక ఆరాధన భావం కలిగేలా సినిమా ముగిస్తుంది. దృశ్యం సినిమా చూసిన ప్రేక్షకులు ఈ మూవీ మరింత ఆసక్తిని కలిగిస్తుంది.

ఈ సినిమాలోని పాత్రలను బట్టి చూస్తే..మోహన్ లాల్.. ఇందులో ఆయన చేసిన జార్చి కుట్టి అనే పాత్రలో పూర్తిగా జీవించేశారని చెప్పుకోవాలి. అలాగే ఐజీగా చేసిన మురళి గోపి కూడా నిజంగా పోలీస్ ఉన్నతాధికారి అనేలాగా అద్భుతంగా నటించారు. ఇక మీనా, ఎస్తేర్, అన్సిబా, అశా శరత్, సిద్దిఖ్ కూడా తమ పాత్రలకు తగ్గట్లుగా నటించారు.

రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలో మాత్రం ఒకే ఒక పాట ఉంది. ఈ చిత్రానికి అనిల్ జాన్సన్ సంగీతం.. అలాగే ఉత్కంఠ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బలమనే అనుకోవాలి. ఇక సతీష్ కుూప్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. చివరికి ఈ మూవీ రచయిత కమ్ దర్శకుడు జీతు జోసెఫ్ మరోసారి తానెంటో నిరుపించుకున్నాడు. ప్రేక్షకుడి ఎక్కడా కూడా నిరాశ కలగకుండా.. దృశ్యం సినిమాను మించిన అంచనాలు, ట్విస్టులను అందించాడు.

ముగింపు: ‘దృశ్యం’ కంటే మరింత థ్రిల్ చేస్తుంది. రేటింగ్: 3.30/5

Also Read:

‘Pogaru’ Movie Review : మాస్ ఆడియన్స్ ఆకలి తీర్చే యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘పొగరు’..

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
యానిమల్‌ సినిమా పై విద్యాబాలన్‌ సంచలన కామెంట్స్
యానిమల్‌ సినిమా పై విద్యాబాలన్‌ సంచలన కామెంట్స్
దంచికొట్టిన సూర్య .. తిలక్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన సూర్య .. తిలక్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది