మరో డిఫరెంట్ స్టోరీతో మాట్నీ ఎంటర్టైన్మెంట్ మూవీ.. పోస్టర్ భలే ఇంట్రెస్టింగ్‌గా ఉందే..!

టాలీవుడ్ బడా నిర్మాతలు స్టార్ హీరోలతోనే కాకుండా కొత్తవారిని చిన్న హీరోలను కూడా ప్రోత్సహిస్తూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పెద్ద నిర్మాణసంస్థల్లో ఒక్కటైనా మాట్నీ ఎంటర్టైన్మెంట్  కూడా ఇప్పుడు కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తుంది.

మరో డిఫరెంట్ స్టోరీతో మాట్నీ ఎంటర్టైన్మెంట్ మూవీ.. పోస్టర్ భలే ఇంట్రెస్టింగ్‌గా ఉందే..!
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 12, 2020 | 1:54 PM

టాలీవుడ్ బడా నిర్మాతలు స్టార్ హీరోలతోనే కాకుండా కొత్తవారిని, చిన్న హీరోలను కూడా ప్రోత్సహిస్తూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పెద్ద నిర్మాణసంస్థల్లో ఒక్కటైన మాట్నీ ఎంటర్టైన్మెంట్  కూడా ఇప్పుడు కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన స్వరూప్ ఆర్ఎస్ జె తో ఓ సినిమా చేస్తుంది మాట్నీ ఎంటర్టైన్మెంట్. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు చిత్రయూనిట్.

ఈ మూవీకి ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే డిఫరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పోస్టర్ ముగ్గురు చిన్నపిల్లలు కృష్ణుడు, శివుడు, హనుమంతుడు గెటప్స్ లో చేతిలో గన్స్ తో సీరియస్ గా చూస్తూ కనిపిస్తున్నారు. వెనకాల వాంటెడ్ అనే పోస్టర్ ఉంది. ఈ చిత్రంలో ఈ ముగ్గురి క్యారెక్టర్స్ తో పాటు ఇద్దరు లీడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. త్వరలోనే వారి క్యారెక్టర్స్ ని కూడా రివీల్ చేయనున్నారు. ఈ మూవీకి మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 14 నుంచి రెగ్యులర్ షూట్ ను మొదలు పెట్టనున్నారు.