సేతుపతికి మెగాస్టార్ అండ.?

మన స్టార్ హీరో సినిమాల్లో మరో ఇండస్ట్రీ హీరోలు కీలక పాత్రల్లో నటించడం ఈ మధ్య ఓ ఆనవాయితీ అయిపోయింది. అయితే మన తెలుగు దర్శకులు మాత్రం ఆ హీరో పాత్ర కథకు ఎంత కీలకం అయినా మన హీరోని ఎలివేట్ చేయడానికి అతను నటించిన సీన్స్ తీసేస్తారు. అయితే తాజాగా తెరకెక్కిస్తున్న ఓ భారీ చిత్రంలో నటిస్తున్న తమిళ నటుడి సీన్స్‌ను కొంతవరకు ఎడిట్ చేయాలనీ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు […]

సేతుపతికి మెగాస్టార్ అండ.?
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

May 21, 2019 | 6:03 PM

మన స్టార్ హీరో సినిమాల్లో మరో ఇండస్ట్రీ హీరోలు కీలక పాత్రల్లో నటించడం ఈ మధ్య ఓ ఆనవాయితీ అయిపోయింది. అయితే మన తెలుగు దర్శకులు మాత్రం ఆ హీరో పాత్ర కథకు ఎంత కీలకం అయినా మన హీరోని ఎలివేట్ చేయడానికి అతను నటించిన సీన్స్ తీసేస్తారు. అయితే తాజాగా తెరకెక్కిస్తున్న ఓ భారీ చిత్రంలో నటిస్తున్న తమిళ నటుడి సీన్స్‌ను కొంతవరకు ఎడిట్ చేయాలనీ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి బాహుబలి స్థాయిలో రికార్డులు రావాలని నిర్మాతలు ఆశిస్తున్నారు. అందుకు తెలుగు మార్కెట్ వరకు చిరంజీవి ప్రధాన ఆకర్షణ అయినా.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం చిరంజీవి చరిష్మా సరిపోదు కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను, కీలక పాత్ర కోసం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు.

ఇది ఇలా ఉండగా విజయ్ సేతుపతి పాత్ర ‘సైరా’ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇక అతనికి హీరో కంటే ఎక్కువ డామినేషన్ ఉండకూడదని కాస్త టోన్ డౌన్ చేయాలనే ఆలోచనలో రైటర్స్ ఉన్నారట. ఈ విషయాన్ని చిరంజీవికి తెలియజేస్తే.. ఆయన దీనికి అసలు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి మక్కల్ సెల్వన్ మెయిన్ ఎట్రాక్షన్ అవుతాడని.. అతని నటన అంటే తనకు ఎంతో ఇష్టమని, ఎడిటింగ్‌లో కూడా అతని సీన్స్‌పై వేటుపడకూడదని చిరంజీవి తేల్చి చెప్పడంతో ఈ చిత్రంలో సేతుపతి పాత్ర అద్భుతంగా వచ్చిందని యూనిట్ చెబుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu