Tollywood : ఒక్క ఏడాదిలోనే 8 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన హీరోయిన్.. ఇండస్ట్రీని ఏలేసిన ఈ బ్యూటీ ఎవరంటే..

సినీరంగంలో నటిగా తమకంటూ ఓ స్టార్ స్టేటస్ సంపాదించుకోవడం అంటే చాలా కష్టం. ఎన్నో సవాళ్లు, అవమానాలను అధిగమించి, అందం, అభినయంతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం ఒక్క ఏడాదిలోనే 8 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

Tollywood : ఒక్క ఏడాదిలోనే 8 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన హీరోయిన్.. ఇండస్ట్రీని ఏలేసిన ఈ బ్యూటీ ఎవరంటే..
Raveena Tandon

Updated on: Mar 01, 2025 | 3:58 PM

సినీరంగంలో ఎవరైనా ఎప్పుడు విజయం సాధిస్తారో చెప్పలేము. కొన్నేళ్లు కష్టపడిన పనిచేసినప్పటికీ అదృష్టం కలిసిరాని తారలు చాలా మంది ఉన్నారు. మరికొందరు మాత్రం మొదటి సినిమాతోనే పాపులర్ అయినవారు ఉన్నారు. కానీ ఫస్ట్ మూవీ సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత అదే క్రేజ్ కంటిన్యూ చేసేవాళ్లు చాలా తక్కువ ఉన్నారు. కానీ ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? ఒక్క ఏడాదిలోనే ఏకంగా 8 బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించింది. ఇప్పటికీ ఆమె పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్. ప్రస్తుతం ఆమె వయసు 52 సంవత్సరాలు. ఇప్పటికీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె మరెవరో కాదండి.. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్. 1994లో బాక్సాఫీస్ ను ఏలింది చెప్పుకోవచ్చు.

రవీనా టాండన్ మొదటి చిత్రం ‘పథర్ కే ఫూల్’. ఈ సూపర్ హిట్ చిత్రం ద్వారా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత 1994లో మోహ్రా సినిమాలో కనిపించింది. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, నసీరుద్దీన్ షా కూడా ఈ చిత్రంలో నటించారు. గోవింద నుండి అక్షయ్ వరకు సినీరంగంలోని స్టార్స్ అందరి సరసన నటించింది. నటి రవీనా టాండన్ నటించిన 8 చిత్రాలు ఒక సంవత్సరంలో భారీ వసూళ్లు సాధించాయి. 1995లో రవీనా, షారుఖ్ కలిసి జమానా దీవానా అనే సినిమాలో నటించారు. యష్ చోప్రా షారుఖ్, రవీనాలను డర్ చిత్రంలో నటించాలని అనుకున్నాడు. కానీ ఈ సినిమా కోసం నటి రవీనాకు ఆ దుస్తులు నచ్చలేదని చెబుతున్నారు. దీని తరువాత, నటి జూహి చావ్లా ఆ పాత్రను పోషించింది.

ఇవి కూడా చదవండి

నివేధికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.166 కోట్లు. 2004లో ఆమె నిర్మాత అలిన్ తడానీని వివాహం చేసుకుంది. ప్రశాంత్ నీల్, యష్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 చిత్రంలోనూ కనిపించింది రవీనా.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..