Master movie : డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దమైన దళపతి ‘మాస్టర్’.. రిలీజ్ ఎప్పుడంటే..

కోలీవుడ్‌ స్టార్‌ హీరో 'ఇళయదళపతి'విజయ్ గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.  తమిళ హీరో అయినప్పటికీ విజయ్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది..

Master movie : డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దమైన దళపతి 'మాస్టర్'.. రిలీజ్ ఎప్పుడంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 27, 2021 | 9:34 AM

Master movie :  కోలీవుడ్‌ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’విజయ్ గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తమిళ హీరో అయినప్పటికీ విజయ్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన తన క్రేజ్ దృష్టిలో ఉంచుకొని ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ టాలీవుడ్‌లో మంచి మార్కెటింగ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో విజయ్ మాస్టర్‌  సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో మిశ్రమ స్పందన లభించినప్పటికీ తమిళ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు.

ఇక ఈ సినిమాను త్వరలో డిజిటల్ రిలీజ్ చేయనున్నారని ప్రచారం మొదలైంది . దాంతో ఈ సినిమా డిజిటల్‌లో విడుదల ఎప్పుడంటూ అప్పుడే టాక్ మొదలైంది.ఈ సినిమాను డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తుంది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా మాస్టర్ సినిమా ఈ నెల 29న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు మాస్టర్ తెలుగు తమిళ భాషాలతో పాటు హిందీలో కూడా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

A1 Express Movie Trailer : హాకీ ప్లేయర్ గా సందీప్ కిషన్.. ఆకట్టుకుంటున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ట్రైలర్