
ప్రముఖ మరాఠీ సినీ నటుడు రవీంద్ర మహాజనీ (77) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. పుణెలోని తలేగావ్ దభాడే సమీపంలోని అంబి గ్రామంలోని ప్లాట్‌లో ఆయన మృతదేహం లభించింది. కాగా రవీంద్ర మూడు రోజుల క్రితమే చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఎవరూ ఈ విషయాన్ని గుర్తించలేదు. ఈక్రమంలోనే ఆయన ఉంటున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో రవీంద్ర మృతదేహం కనిపించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు కూడా మూడు రోజుల క్రితమే రవీంద్ర మృతి చెంది ఉండవచ్చంటున్నారు. కాగా మరాఠీ సినిమాల్లో రవీంద్రకు మంచి గుర్తింపు ఉంది. 70-80ల మధ్య ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. రవీంద్రను మరాఠీ సినిమా ఇండస్ట్రీ వినోద్ ఖన్నా అని పిలుస్తారు.
రవీంద్ర మరాఠీలోనే కాకుండా గుజరాతీ సినిమాల్లో కూడా నటించారు. కాగా శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఇరుగుపొరుగు వారు రవీంద్ర అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. అయితే ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడం గమనించారు. తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి లాక్ చేసి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమచారం అందించారు. వారు వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా మృతదేహం కనిపించింది. ఇక వీంద్ర మహాజని కుమారుడు గష్మీర్ మహాజని కూడా నటుడిగా రాణిస్తున్నాడు. అతను ఇప్పటికే ‘ఇమ్లీ’ అనే హిందీ సీరియల్‌లో నటించాడు. అలాగే ‘క్యారీ ఆన్ మరాఠా’ సినిమాను తన తండ్రికి అంకితమిచ్చాడు. అయితే రవీంద్ర మహాజని హఠాన్మరణం మరాఠా సినిమా ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Veteran actor Ravindra Mahajani found dead in Pune
Read @ANI Story | https://t.co/gGyIUyF6Fi#RavindraMahajani #Death #MarathiCinema pic.twitter.com/Piweriu4rs
— ANI Digital (@ani_digital) July 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.