AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను.. స్టార్ నటి సంచలన కామెంట్స్

ఎంత కాదనుకున్నా సినిమా ఇండస్ట్రీలో పురుషాధిపత్యం కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడైనా, ఇప్పుడైనా నటీమణులు కొందరు నటుల చేతుల్లో తరచూ వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అయితే కొందరు వీటిని బయట చెప్పుకోలేరు. మరికొందరు మాత్రం ధైర్యంగా తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంటారు.

Actress: స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను.. స్టార్ నటి సంచలన కామెంట్స్
Actress Priya Bapat
Basha Shek
|

Updated on: Jun 10, 2026 | 11:35 AM

Share

సినిమా ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొనే ఇబ్బందులు, వేధింపుల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మీటూ ఉద్యమం తర్వాత ప్రముఖ హీరోయిన్లు, నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ నటి చేరింది. మలయాళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రియా బాపట్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన వేధింపులను గుర్తు చేసుకుని బాగా ఎమోషనలైంది. ఓ పాట షూటింగ్ సమయంలో తన కో-యాక్టర్ స్క్రిప్ట్‌లో లేని సన్నివేశాలను ఇంప్రొవైజేషన్ పేరుతో చేయడమే కాకుండా పదేపదే బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని ప్రియా వాపోయింది. ‘ ఒక సినిమా షూటింగ్ లో పాట చిత్రీకరణ సమయంలో స్క్రిప్ట్‌లో ఎక్కడా కిస్సింగ్ సీన్స్ లేవు. అయినప్పటికీ నా సహనటుడు ఇంప్రొవైజేషన్ పేరుతో లిమిట్స్ దాటాడు. కెమెరా ముందే పదేపదే నన్ను ముద్దుపెట్టుఉకున్నాడు. అప్పుడు సెట్‌లో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉండటం, నేను కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం వంటి కారణాలతో వెంటనే స్పందించలేకపోయాను’.

‘ఆ సమయంలో నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. అతడిని అడ్డుకోవాలా, డైరెక్టర్‌కు చెప్పాలా, లేక షూటింగ్ ఆపాలా అనే అయోమయంలో ఉండిపోయాను. కెమెరా ముందే పదేపదే నన్ను ముద్దు పెడుతుంటే చాలా అవమానంగా అనిపించింది. కానీ నా ఎమోషన్స్ ను దాచుకుని నటించాల్సి వచ్చింది. ఆ ఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా ఇప్పటికీ బాధ కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు కూడా వచ్చాయి. ఆ హీరో వేధింపులు అక్కడితో ఆగలేదు. ఒకే హోటల్‌లో వేర్వేరు గదుల్లో ఉంటున్నప్పటికీ ప్రతిరోజూ నన్ను బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌కు రావాలని ఒత్తిడి చేసేవాడు. నేను నో అని చెప్పినప్పటికీ అతనిలో మార్పు రాలేదు’.

ఇవి కూడా చదవండి

ప్రియా బాపట్ గ్లామరస్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Priya Bapat (@priyabapat)

‘ఒక రోజు రాత్రి నా గది వద్దకు వచ్చి తలుపు తట్టాడు. దీంతో నేను తీవ్ర భయాందోళనకు గురయ్యాను. నేను వెంటనే రేపు కలుద్దామని చెప్పి అప్పుడు తప్పించుకున్నాను. ఆ తర్వాత వెంటనే నా భర్త ‌కు ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ చెప్పాను. దీంతో మా ఆయన వెంటనే నా దగ్గరకు వచ్చేశాడు. మూడు రోజుల పాటు నాతోనే ఉండి ధైర్యం చెప్పాడు. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మనుగడ సాగించలేం’ అని ప్రియా బాపట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
ఆలయంలో పుష్ప రాజ్‌ హల్‌చల్..సెల్ఫీలకు ఎగబడ్డ సిబ్బంది..కట్‌చేస్తే
ఆలయంలో పుష్ప రాజ్‌ హల్‌చల్..సెల్ఫీలకు ఎగబడ్డ సిబ్బంది..కట్‌చేస్తే