AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆలయంలో పుష్ప రాజ్‌ హల్‌చల్..సెల్ఫీలకు ఎగబడ్డ సిబ్బంది..కట్‌చేస్తే, క్లైమాక్స్‌ అదిరిపోయిందిగా!

ఉజ్జయినిలోని ప్రపంచ ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయంలో ఒక యువకుడు పుష్ప-2 సినిమాలోని అల్లు అర్జున్ జాతార గెటప్‌లో ప్రత్యక్షమవ్వడం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై కచ్చితమైన నిషేధం ఉన్నప్పటికీ, సదరు యువకుడు నిబంధనలను ఉల్లంఘించి రీల్స్, వీడియోలు చిత్రీకరించాడు. అక్కడి భద్రతా సిబ్బంది అతడిని వారించాల్సింది పోయి, విఐపి (VIP) ప్రోటోకాల్‌తో లోపలికి తీసుకెళ్లడమే కాకుండా, అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Watch Video: ఆలయంలో పుష్ప రాజ్‌ హల్‌చల్..సెల్ఫీలకు ఎగబడ్డ సిబ్బంది..కట్‌చేస్తే, క్లైమాక్స్‌ అదిరిపోయిందిగా!
Pushpa Raj Lookalike
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2026 | 11:13 AM

Share

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో వెలిసిన ప్రపంచ ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయం నిరంతరం భక్తులతో రద్దీగా ఉంటుంది. అయితే, తాజాగా ఈ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఒక విచిత్రమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పుష్ప-2 సినిమాలోని అల్లు అర్జున్ జాతార లుక్‌ను అనుకరిస్తూ ఒక యువకుడు విచిత్రమైన వేశధారణతో ఆలయంలోకి ప్రవేశించడం, అక్కడ రీల్స్ చేయడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ ఘటన ఆలయ నిబంధనలను, భద్రతా వ్యవస్థను తీవ్రంగా ప్రశ్నించేలా చేసింది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు యువకుడు నీలం రంగు చీర, బ్లౌజ్ ధరించి, చేతులకు గాజులు, ముక్కుకు ముక్కు పుడక, మెడలో నిమ్మకాయల దండ వేసుకుని పుష్ప రాజ్‌ గెటప్‌లో ఆలయానికి వచ్చాడు. అతని విచిత్ర రూపాన్ని చూసి అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. అయితే, అసలు వివాదం అతడు ఆలయానికి రావడం వల్ల కాదు, అక్కడ జరిగిన నిబంధనల ఉల్లంఘనల వల్ల తలెత్తింది.

మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో భద్రతా కారణాల దృష్ట్యా, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటానికి ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడంపై పూర్తి నిషేధం ఉంది. కానీ, ఆ యువకుడు లోపలికి ప్రవేశించినప్పటి నుండి గణేష్ మండపం వరకు నిరంతరం వీడియోలు చిత్రీకరిస్తూనే ఉన్నాడు. అక్కడ మోహరించిన భద్రతా సిబ్బంది అతడిని ఆపాల్సింది పోయి, విఐపి భక్తుడిలా ఆదరిస్తూ లోపలికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, కొందరు సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడితో సెల్ఫీలు దిగడానికి పోటీ పడటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ యువకుడు ఈ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలలో అప్‌లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉండటంతో మహాకాల్ ఆలయ కమిటీ తక్షణమే స్పందించింది. ఆలయ నిబంధనలను గాలికొదిలేసి, సదరు యువకుడికి సహకరించినందుకు, భద్రతా లోపానికి కారణమైనందుకు గానూ అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను ఉద్యోగం నుండి తక్షణమే బర్తరఫ్ చేశారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. సినిమా క్రేజ్, సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ప్రజలను ఎంతవరకు తీసుకెళ్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పుణ్యక్షేత్రాలకు వచ్చేటప్పుడు అక్కడి ఆచారాలను, నియమాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో