యాక్టింగ్ ఆఫర్.. మణి ఎందుకు వద్దన్నారో తెలిస్తే..!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నంకు ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశంలో ఉన్న లెజండరీ దర్శకుల లిస్ట్‌లో ఆయన పేరు కచ్చితంగా ఉంటుంది.

  • Tv9 Telugu
  • Publish Date - 5:42 pm, Thu, 16 April 20
యాక్టింగ్ ఆఫర్.. మణి ఎందుకు వద్దన్నారో తెలిస్తే..!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నంకు ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశంలో ఉన్న లెజండరీ దర్శకుల లిస్ట్‌లో ఆయన పేరు కచ్చితంగా ఉంటుంది. అలాంటి దర్శకుడికి నటుడిగా ఓ ఆఫర్ వచ్చిందట. ఆ అవకాశం ఇచ్చింది ఎవరో కాదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తనయ ఐశ్వర్యా ధనుష్‌. తాను తెరకెక్కించిన సినిమాలోని ఓ పాత్రలో మణిరత్నం బావుంటుందని భావించిన ఐశ్వర్యా.. అందుకోసం ఆయనను సంప్రదించారట. అయితే ఈ ఆఫర్‌కు ఆయన నో చెప్పారట.

ఈ విషయాన్ని తాజాగా అభిమానులతో పంచుకున్నారు మణిరత్నం. వాట్సాప్‌లో అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు మణిరత్నం సమాధానం ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మీకు ఎప్పుడు నటుడిగా ఆఫర్‌ రాలేదా..? అని ఓ అభిమాని ఆయనను ప్రశ్నించారు. దానికి మణి స్పందిస్తూ.. ”ఐశ్వర్య ఆ ఆఫర్ ఇచ్చారు. కానీ నేను నో చెప్పాను. ఎందుకంటే కెమెరా ముందు నిలబడిన నటీనటులను నేను డైరక్ట్ చేస్తుంటా. ఒకవేళ వారికి ఏదైనా చెప్తే.. నువ్వు ఎలా నటించావో ఆ సినిమాలో మేము చూశాము అని అంటారేమోనని నటించలేదు” అని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఆఫర్ కు ఆయన ఒప్పుకొని ఉంటే.. తెరపై అతడిని చూసే అవకాశం అందరికీ కలిగేది. కాగా 2018లో నవాబ్‌ మూవీతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇందులో విక్రమ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్ పూర్తైన తరువాత ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Read This Story Also: కరోనా మరణాలు vs శ్రీకృష్ణుడి అంత్యక్రియలు.. వివరణ ఇచ్చిన లిరిసిస్ట్‌..!