‘వైకుంఠపురంలో’.. అలా తమిళంలో..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పూజా హెడ్గే, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను ప్రస్తుతం పలు బాషలలో రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో కొందరు నిర్మాతలు రీమేక్ చేసేందుకు సన్నద్ధం అవుతుండగా.. కన్నడంలో మాత్రం తెలుగు సినిమానే బ్లాక్‌బస్టర్ సాధించడంలో […]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పూజా హెడ్గే, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను ప్రస్తుతం పలు బాషలలో రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్‌లో కొందరు నిర్మాతలు రీమేక్ చేసేందుకు సన్నద్ధం అవుతుండగా.. కన్నడంలో మాత్రం తెలుగు సినిమానే బ్లాక్‌బస్టర్ సాధించడంలో రీమేక్ ఆలోచనను విరమించుకున్నారు. మలయాళంలో అనువాదమైన ఈ సినిమా అక్కడ బంపర్ హిట్ అయింది. ఇక తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారట. హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్‌లో నటించానున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని కోలీవుడ్ టాక్. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Also Read:
ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..
అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..
చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..
కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఈ-పాస్‌గా ‘ఆరోగ్య సేతు’ యాప్..
‘ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలా.?’ గూగుల్‌లో ట్రెండ్ సెట్ చేసిన మందుబాబులు…
