‘ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలా.?’ గూగుల్‌లో ట్రెండ్ సెట్ చేసిన మందుబాబులు

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడటంతో మందుబాబులకు పిచ్చెక్కిపోతోంది. ఎలగైన లిక్కర్ సంపాదించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కోవలో కొందరు ఆత్మహత్య చేసుకోగా.. మరికొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు. అటు ఇదే అదనుగా చేసుకుని ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే మద్యం సరఫరా చేస్తామంటూ కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మరోవైపు బ్రాండెడ్ లిక్కర్ పేరుతో కొంతమంది కల్తీ మద్యాన్ని కూడా విక్రయిస్తున్నారు. ఇలా మందుబాబులు ఎంత ప్రయత్నించినా గానీ ఆల్కహాల్ మాత్రం దొరకడం లేదు. ముంబైకి […]

'ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలా.?' గూగుల్‌లో ట్రెండ్ సెట్ చేసిన మందుబాబులు
Follow us

|

Updated on: Apr 16, 2020 | 4:51 PM

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూతపడటంతో మందుబాబులకు పిచ్చెక్కిపోతోంది. ఎలగైన లిక్కర్ సంపాదించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కోవలో కొందరు ఆత్మహత్య చేసుకోగా.. మరికొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు. అటు ఇదే అదనుగా చేసుకుని ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే మద్యం సరఫరా చేస్తామంటూ కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.

మరోవైపు బ్రాండెడ్ లిక్కర్ పేరుతో కొంతమంది కల్తీ మద్యాన్ని కూడా విక్రయిస్తున్నారు. ఇలా మందుబాబులు ఎంత ప్రయత్నించినా గానీ ఆల్కహాల్ మాత్రం దొరకడం లేదు. ముంబైకి చెందిన మనీష్ అనే వ్యక్తి తాను రూ. 170 విలువ చేసే విస్కీ బాటిల్‌ను రూ.700 పెట్టి కొన్నానని.. ఈ లాక్ డౌన్ సమయంలో అంతకంటే ఎక్కువ ఇచ్చి కొందామన్నా మద్యం దొరకట్లేదని అన్నాడు. ఈ నేపధ్యంలోనే మందుబాబులు సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ‘ఇంట్లో మద్యం తయారు చేయడం ఎలా.? అని గూగుల్‌లో వెతికారు. ఈ టాపిక్ మార్చి 22- 28 వరకు గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో ఉంది. దీన్ని బట్టే తెలుస్తోంది.. మందుబాబులు లిక్కర్ కోసం ఎలా పరితపిస్తున్నారో..

Also Read:

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఈ-పాస్‌గా ‘ఆరోగ్య సేతు’ యాప్..