‘గాడ్‌ ఫాదర్’‌ అంత డెప్త్.. జగన్ బయోపిక్‌పై దర్శకుడి వ్యాఖ్యలు..!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌పై ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవ క్లారిటీ ఇచ్చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ దర్శకులు జగన్ బయోపిక్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వైఎస్‌ కథను సినిమా చేయడానికి ఇబ్బంది పడాలేమో కానీ.. జగన్ జీవితం గురించి ఏ ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. ఎందుకంటే జగన్ జీవితంలో గాడ్‌ ఫాదర్‌ అంత లోతు ఉంటుందని మహి పేర్కొన్నారు. జగన్ లైఫ్‌లో హీరోయిజం, కష్టాలు, దరిద్రం, […]

'గాడ్‌ ఫాదర్'‌ అంత డెప్త్.. జగన్ బయోపిక్‌పై దర్శకుడి వ్యాఖ్యలు..!
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 4:17 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌పై ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవ క్లారిటీ ఇచ్చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ దర్శకులు జగన్ బయోపిక్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వైఎస్‌ కథను సినిమా చేయడానికి ఇబ్బంది పడాలేమో కానీ.. జగన్ జీవితం గురించి ఏ ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. ఎందుకంటే జగన్ జీవితంలో గాడ్‌ ఫాదర్‌ అంత లోతు ఉంటుందని మహి పేర్కొన్నారు. జగన్ లైఫ్‌లో హీరోయిజం, కష్టాలు, దరిద్రం, అడ్మినిరేషన్‌, పోరాటం.. ఇలా అన్నీ ఉన్నాయని.. ఆయన జీవితం మంచి ఎమోషనల్ జర్నీగా అవుతుందని ఆయన వెల్లడించారు. ఇక ఈ బయోపిక్‌కు జగన్ అన్న దగ్గర నుంచి ఓకే వస్తే.. 2022లో గానీ 23లో కచ్చితంగా తెరకెక్కిస్తానని స్పష్టం చేశారు. అప్పటిలోపు రెండు వెబ్‌ సిరీస్‌లు, ఒక చిన్న సినిమా తెరకెక్కిస్తాను అని మహి వి రాఘవ చెప్పుకొచ్చారు.

ఇక లాక్‌డౌన్‌ సమయంలో ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు.. ఇంట్లో పనులతో బిజీగా ఉన్నానని వివరించారు. పనివాళ్లు ఎవ్వరూ రాకపోవడంతో ఇంట్లో పనులను పంచుకుంటున్నానని మహి అన్నారు. పాత్రలు తోమడం, ఇళ్లు శుభ్రపరచడం తన వాళ్ల కాదు కాబట్టి.. వంటలు చేస్తున్నానని ఆయన వివరించారు. కాగా వైఎస్సార్ జీవిత కథతో మహి వి రాఘవ యాత్ర సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Read This Story also: క‌రోనాకు అమ్మాయిల‌కు ముడిపెడుతూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు