విజయ్‌తో ఆ రొమాంటిక్ సీన్స్ నాకు అవసరమా అనిపించింది

ఎంత సినిమా అయినా నా లిమిట్స్ నేను క్రాస్ చేయకూడదని నిర్ణయించుకున్నా. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నా లిమిట్స్ నేను క్రాస్ చేయాల్సి వచ్చింది. విజయ్‌తో రోమాంటిక్ సీన్ ఉందని అమ్మా, నాన్నలకు చెప్పా...

విజయ్‌తో ఆ రొమాంటిక్ సీన్స్ నాకు అవసరమా అనిపించింది
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 2:53 PM

యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి తన సినీ కెరీర్‌‌‌ని పెంచుకుంటూనే వెళ్లింది. టాలీవుడ్‌లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. ఒక విషయం గురించి తాను ఎంతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది రాశీ. ఇటీవలే విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో విజయ్‌తో కలిసి రాశి రోమాన్స్ చేసింది.

రాశి ఖన్నా వెండితెరపై గ్లామర్‌గా కనిపించేందుకు వెనకాడదు. అలాగని హద్దులు కూడా దాటే గ్లామర్ పాత్రలూ చేయదు. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం మాత్రం రాశికి ఇష్టం లేకపోయినప్పటికీ బెడ్‌ సీన్‌లో నటించింది. ఆ సన్నివేశంలో నటించే సమయంలో తన అనుభవాలను రాశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

ఎంత సినిమా అయినా నా లిమిట్స్ నేను క్రాస్ చేయకూడదని నిర్ణయించుకున్నా. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నా లిమిట్స్ నేను క్రాస్ చేయాల్సి వచ్చింది. విజయ్‌తో రోమాంటిక్ సీన్ ఉందని అమ్మా, నాన్నలకు చెప్పా. వారు కంగారు పడ్డారు. అది ఒక క్యారెక్టర్‌లా మాత్రమే చూడమని.. పట్టించుకోకండి అని చెప్పా.

ఆ టైంలో విజయ్ దేవర కొండ ఒక మాట చెప్పాడు. రాశి ఆల్రెడీ నాకు ఇలాంటి ఇమేజ్ ఉంది. కానీ నీకు ఇది కొత్త. నీకు ఇవ్వగలిగినంత సపోర్ట్ నా నుంచి ఉంటుందని చెప్పాడు. అతని మాటలతో కొంత కూల్‌ అయ్యా. కానీ ఆ సన్నివేశం చేసిన తర్వాత ఇలాంటివి అవసరమా.. నేను రాశీ ఖన్నాని.. ఫ్యాన్స్ నన్ను రాశి ఖన్నాలాగే చూస్తారు. ఆ సన్నివేశాలపై నాకు ఆసక్తి కూడా లేదని రాశీ తన మనసులోని మాట చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్