డెట్రాయిట్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతోన్న మహేష్..!
లాక్‌డౌన్ తరువాత దాదాపుగా అన్ని రంగాలు తిరిగి తమ పనులను ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కూడా షూటింగ్‌లను ప్రారంభించేసింది
Mahesh Babu news: లాక్‌డౌన్ తరువాత దాదాపుగా అన్ని రంగాలు తిరిగి తమ పనులను ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కూడా షూటింగ్‌లను ప్రారంభించేసింది. ఇటు టాలీవుడ్‌లోనూ నిదానంగా ఒక్కో హీరో సెట్స్ మీదకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ మహేష్ కూడా షూటింగ్‌కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఓ యాడ్ షూటింగ్ కోసం సెట్స్ మీదకు అడుగెట్టిన మహేష్.. త్వరలో మూవీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో నటించేందుకు మహేష్ ఓకే చెప్పగా.. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ కోసం డెట్రాయిట్ వెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. కథానుగుణంగా ఈ మూవీలోని కొంత భాగం అమెరికా నేపథ్యంలో సాగనుంది కాబట్టి.. టీమ్ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. ఈ క్రమంలో మొదట మహేష్, దర్శకుడు ఓ ఛార్టర్ ఫ్లైట్‌లో అక్కడికి వెళ్లనున్నారట. అక్కడి పరిస్థితులను బట్టి ఆ తరువాత మిగిలిన టీమ్ వెళ్లనుందట. కాగా బ్యాంక్ స్కాం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో చిరు ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని సమాచారం. ఇక కీర్తి సురేష్ ఓ హీరోయిన్‌గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Read More: