చిరంజీవి-మెహర్ రమేష్ సినిమా ఫిక్స్ ?
మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇండస్ట్రీ వర్గాల నుంచి.
మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇండస్ట్రీ వర్గాల నుంచి. ప్రస్తుతం చిరు ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. దీని తర్వాత ‘సాహో’ సినిమాను తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వంలో మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ రీమేక్‌లో మెగాస్టార్ నటించనున్నారని వార్తలు వినిపించాయి. ఆ సినిమా స్క్రిప్టు విషయంలో సుజిత్ చేసిన ఛేంజస్ చిరంజీవికి నచ్చక, ప్రాజక్టును తాత్కాలికంగా నిలిపివేశారని కూడా ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో ఆచార్య సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో చర్చ జరిగింది.
కాగా తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారట. అజిత్ హీరోగా తమిళంలో వచ్చి విజయం సాధించిన ‘వేదాళం’ చిత్రాన్ని మెహర్ రమేష్ చిరుతో రీమేక్ చేయనున్నారట. మూడేళ్లు స్క్రిప్ట్ పై హార్డ్ వర్క్ చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పుచేర్పులు చేశారట. తాజాగా స్టోరీ విన్న చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read :